Neehar Sachdeva
Neehar Sachdeva : ఆడవారిలో జుట్టు రాలిపోతుంటే తెలియని ఆందోళనకు గురవుతారు. మగవారు కూడా జుట్టు రాలి బట్టతల వస్తే డిప్రెస్ అవుతారు. అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చాలామంది జుట్టు ఊడిపోతుంటే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. సమాజంలో ఎలా తిరగాలని ఆవేదన చెందుతారు. అలాంటి వారంతా నీహార్ సచ్‌దేవా కథ తప్పకుండా చదవండి.
Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !
ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు అందానికి కొలమానం. జుట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. జుట్టు ఊడిపోతుంటే కొందరు కాన్ఫిడెన్స్ కోల్పోతుంటారు. కొందరిలో కొన్ని అనారోగ్యాల కారణంగా, కొన్ని మందులు వాడటం కారణంగా హెయిర్ ఫాల్ ఉంటుంది. కొద్దిరోజుల తర్వాత తిరిగి మామూలుగా పెరుగుతుంది. నీహార్ సచ్‌దేవా విషయంలో అలా జరగలేదు. ఇంతకీ ఇవరీ లేడీ? అసలు ఏంటి ఈమె కథ?
నీహార్ సచ్‌దేవా ఈ భారతీయ మహిళ లాస్ ఏంజిల్స్ ఉంటున్నారు. వెస్ట్ మన్రో అనే కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఒకప్పుడు తనలోని ఒక లోపాన్ని ఆమె ఎలా జయించిందో తెలుసుకుంటే చాలామంది స్ఫూర్తి పొందుతారు. నీహార్ సచ్‌దేవా 6 నెలల వయసులో ఉన్నప్పుడు ‘అలోపేసియా’ డిటెక్ట్ అయ్యింది. దీని కారణంగా జుట్టు, కనుబొమ్మలు రాలిపోతుంటాయి. మరలా వస్తుంటాయి. అంటే స్థిరంగా ఉండవు. దాంతో స్కూల్ డేస్‌లో విగ్ ధరించడం అలవాటు చేసుకున్నారు. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక ఈ సమస్యకు ఒక సొల్యూషన్ గురించి ఆలోచించిన నీహార్ సచ్‌దేవా పూర్తిగా జుట్టును తొలగించి గుండు కొట్టించుకోవడం మొదలుపెట్టారు.
Healthy Hair : జుట్టుకు ఏది బెస్ట్.. డెర్మటాలజిస్టులు ఇస్తున్న సూచనలు
నీహార్ సచ్‌దేవా నిర్ణయాన్ని మొదట కుటుంబ సభ్యులు అంగీకరించలేదట. భవిష్యత్‌లో పెళ్లి ఎలా అవుతుందని ఆందోళన పడ్డారట. కొన్ని సంవత్సరాలుగా తనకున్న సమస్య గురించి నీహార్ సచ్‌దేవా తన చెల్లెలి పెళ్లిలో అందరిముందు ధైర్యంగా బయటపెట్టారట. దాంతో అన్నిరోజులుగా దాచి ఉంచి తాను ఎదుర్కొంటున్న సమస్య నుంచి స్వేచ్ఛ లభించినట్లైందట. అక్కడి నుంచి తనకు నచ్చిన విధంగా జీవితంలో సంతోషంగా ఉండటం మొదలుపెట్టారు నీహార్ సచ్‌దేవా.
కొన్ని సంవత్సరాల తర్వాత నీహార్ సచ్‌దేవా జీవితంలోకి అరుణ్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. తన గురించి అన్నీ తెలిసి అర్ధం చేసుకున్న అరుణ్‌ని ఆమె పెళ్లాడారు. ప్రస్తుతం తానెంతో సంతోషంగా గర్వంగా జీవిస్తున్నట్లు నీహార్ సచ్‌దేవా చెబుతారు. జీవితంలో వచ్చే సమస్యలకు భయపడి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే వారికి నీహార్ సచ్‌దేవా కథ నిజంగా ఎంతో స్ఫూర్తి. తనకి ఉన్న సమస్యనుంచి తను ఉపశమనం పొందడమే కాకుండా దానిని ధైర్యంగా చెప్పి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జీవితాన్ని అందంగా మలుచుకున్న నీహార్ సచ్‌దేవా నిజంగా గ్రేట్ లేడీ. ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.