Healthy Hair : జుట్టుకు ఏది బెస్ట్.. డెర్మటాలజిస్టులు ఇస్తున్న సూచనలు
జుట్టు రంగు కాపాడుకోవడం కోసం రోజూ తలస్నానం అవసరం లేదు. నిజానికి తరచుగా జుట్టు కడగడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. మీ జుట్టు రంగు ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండాలంటే కలర్ సేఫ్ షాంపూ వాడండి.షాంపూతో జుట్టు కడగడాన్ని పరిమితం చేయండి.

HairCare
Healthy Hair : జుట్టుకు రెగులర్ గా నూనె రాయండి అంటూ ఒకరు.. అసలు నూనె రాయనే వద్దని మరొకరు. తలస్నానం చేయాలని ఒకరు, చేయొద్దని ఇంకొకరు… ఇలా జుట్టు ఆరోగ్యానికి సంబంధించి అనేక మంది అనేక రకాలుగా చెబుతుంటారు. అవన్నీ విని గందరగోళంలో పడతాం. అయితే అంతర్జాతీయంగా డెర్మటాలజిస్టులు ఇస్తున్న సూచనలివి.
READ ALSO : Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు
కట్ చేస్తే జుట్టు పెరుగుతుందా?
తరచుగా హెయిర్ కట్ చేయించుకుంటూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుందని చెబుతుంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. అయితే జుట్టు ఆరోగ్యంగా మాత్రం పెరుగుతుంది. కేశాల చివర్లో పగుళ్లు ఏర్పడిన కొద్దీ కట్ చేయిస్తూ ఉంటే ఈ పగుళ్లను నివారించవచ్చు. ఇలా పగుళ్లను తీసేయడం వల్ల జుట్టు పెరుగుతుందనుకుంటారు. కానీ జుట్టు బాగా పెరగాలంటే కుదుళ్లు ఆరోగ్యంగా ఉండాలి. వాటికి తగిన పోషణ అందాలి.
తలస్నానం చేయాలా.. వద్దా?
జుట్టు రంగు కాపాడుకోవడం కోసం రోజూ తలస్నానం అవసరం లేదు. నిజానికి తరచుగా జుట్టు కడగడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. మీ జుట్టు రంగు ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండాలంటే కలర్ సేఫ్ షాంపూ వాడండి.షాంపూతో జుట్టు కడగడాన్ని పరిమితం చేయండి. అప్పుడే మీ జుట్టు రంగుకు దీర్ఘాయుష్షు లభిస్తుంది.
READ ALSO : Hat Cause Hair Loss : క్యాప్ పెట్టుకుంటే జుట్టు రాలిపోవడం నిజమేనా?
హెయిర్ బొటాక్స్
హెయిర్ బొటాక్స్ అనే ప్రక్రియ ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. వెంట్రుకల కుదుళ్లలోకి కెరొటిన్ ని పంపడం ద్వారా డీప్ కండిషనింగ్ చేసే చికిత్సే ఈ హెయిర్ బొటాక్స్. అయితే దీనివల్ల ఫలితం తాత్కాలికమే.
డీప్ కండిషనింగ్ మాస్క్
శిరోజాలకు తేమ ఉంటే అవి బాగా పెరుగాయన్నది తెలిసిందే. అయితే పొడిబారిన జుట్టు కోసం, పాడయిన వెంట్రుకల కోసం డీప్ కండిషనింగ్ మాస్కులు వాడుతుంటారు. అయితే వీటిని రోజూ వాడకూడదు. వారానికి ఒకసారి వాడితే చాలు. ఈ మాస్కు ద్వారా వచ్చే పోషకాలు అందేవరకు టైం ఇవ్వాలి. అందుకే రోజూ వాడొద్దు. తేమ ఉండే మాస్కులు వాడటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సీరమ్
హెయిర్ సీరమ్ ల గురించిన ప్రకటనలు ఇప్పుడు కోకొల్లలు. వీటి వాడకం కూడా పెరిగిపోయింది. ఇవి జుట్టుకు మెరుపునిస్తాయి. అయితే వీటిని వెంట్రుకల చివర్లకు మాత్రమే అప్లయి చేయాలి. నూనె లాగా కుదుళ్లకు పట్టించవద్దు. మరీ ఎక్కువగా రాస్తే జిడ్డుగా అవుతుంది. కాబట్టి సరైన విధానంలో వాడాలి.
ఎండ నుంచి రక్షణ
ఎండలో సూర్య కిరణాల నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు చర్మానికి నష్టం కలిగిస్తాయి. వాటివల్ల విపరీతంగా టాన్ అవుతుంది కూడా. చర్మానికే కాదు.. శిరోజాలకు కూడా ఈ అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి రక్షణ అవసరం. యూవీ కిరణాల వల్ల జుట్టు పొడిబారుతుంది. ఫేడ్ అవుతుంది. కాబట్టి వీటి నుంచి రక్షణ నిచ్చే హెయిర్ కేర్ ఉత్పత్తులనే వాడాలి.