Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు

గుండె కోసం కార్డియో వ్యాయామాలు చేస్తారు. కానీ వాటితో పాటే శరీర బరువు తగ్గించుకోవడం కూడా అవసరం.బరువులు ఎత్తడం, కేలరీలు కరిగించడం ముఖ్యమే. వాటివల్ల కండరాలు బలపడటమే కాదు, కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది.

Heart Health : గుండె ఆరోగ్యం కోసం… కార్డియాక్ ఎక్సర్ సైజులు

cardio exercises

Heart Health : ఇటీవలి కాలంలో చాలామంది హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఏ రోజు ఎవరికి గుండెపోటు వచ్చిందనే వార్త వినాల్సి వస్తుందో అనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో గుండెను బలంగా ఉంచుకోవడం అవసరం. ఇందుకోసం గుండె కండరానికి, రక్తప్రసరణ మెరుగుపడటానికి కొన్ని రకాల వ్యాయామాలు ఉపయోగపడుతాయి. అయితే గుండెకు సంబంధించిన వ్యాయామాలు ఏమిటో, వాటిని ఎలా చేస్తే మంచిదో చాలామందికి తెలియదు. గుండెకు సంబంధించిన వ్యాయామాలనే కార్డియాక్ ఎక్సర్ సైజులు అంటారు.

READ ALSO : Covid affected brain function : దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తి మెదడు పనితీరులో రెండేళ్లపాటు ఇబ్బందులు తప్పవట

కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బీపీ, కొలెస్ట్రాల్, బరువు తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

చాలా మంది గుండె కోసం కార్డియో వ్యాయామాలు చేస్తారు. కానీ వాటితో పాటే శరీర బరువు తగ్గించుకోవడం కూడా అవసరం.బరువులు ఎత్తడం, కేలరీలు కరిగించడం ముఖ్యమే. వాటివల్ల కండరాలు బలపడటమే కాదు, కొవ్వు కూడా తొందరగా కరుగుతుంది. వారానికి రెండు సార్లు బరువులెత్తే వ్యాయామాలు కనీసం ఒక గంట సేపు చేయడం ఉత్తమం.

READ ALSO : Vitamin D Deficiency : విటమిన్ డి లోపంతో గుండెజబ్బులు వస్తాయా ?

ఈ వ్యాయామాలు బెస్ట్

ఏరోబిక్ఎక్సర్‌సైజ్: వారానికి కనీసం 150 నిమిషాలు మామూలు స్థాయిఏరోబిక్ వ్యాయామాలు, 75 నిమిషాల హై ఇంటెన్సిటీఏరోబిక్ వ్యాయామాలు చేయొచ్చు. వేగంగా నడవటం, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, రన్నింగ్ లేదా బాస్కెట్ బాల్, సాకర్ లాంటి ఆటలు ఆడొచ్చు.

 స్ట్రెంత్ ట్రైనింగ్: వారానికి కనీసం రెండు రోజులు కండరాలకు సంబంధించిన వ్యాయామం చేయాలి. కాళ్లు, భుజాలు, వెన్ను కండరాల బలం కోసం ఇవి ఉపయోగపడతాయి. బరువులెత్తడం, రెసిస్టెంట్ బ్యాండ్ వర్కవుట్స్, యోగా ఇవన్నీ దీని కిందకే వస్తాయి.

 ఫ్లెక్సిబిలిటీ: శరీరం సాగేగుణాన్ని పెంచే వ్యాయామాలు చేయాలి. స్ట్రెచ్చింగ్, యోగా ఉత్తమమైనవి. వీటివల్ల శరీరం సాగేగుణం పెరగడంతో పాటూ, బ్యాలెన్సింగ్ మెరుగవుతుంది.

READ ALSO : Heart Disease : యువతలో గుండె జబ్బులు పెరగడానికి 4 కారణాలు !

 ఇవి గుర్తుంచుకోండి ;

వయసు, గుండె ఆరోగ్యం, ఫిట్ నెస్ బట్టి వివిధ రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. మీకేమన్నా ఇబ్బందులుంటే ముందుగా వైద్యుల్ని సంప్రదించాలి.

ఏదైనా వ్యాయామం ఒక్కసారిగా ఎక్కువ ఇంటెన్సిటీతో మొదలుపెడితే ప్రమాదమే. అందుకే మెల్లమెల్లగా వ్యాయామం చేసే సమయం, కఠినత్వం పెంచుతూ వెళ్లాలి. దానివల్ల మన శరీరం తొందరగా అలవాటు పడుతుంది.

అలాగే అవసరమైనన్ని నీళ్లు తాగడం ముఖ్యం. అనుకున్న పనిని క్రమం తప్పకుండా చేయాలంటే మోటివేషన్ అవసరం. అందుకే ఏదో తప్పనిసరి అనుకోకుండా వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా వ్యాయామం చేయండి.

మీరు సాధించదగ్గ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. వాటివల్ల మీకింకా కొనసాగించాలనే ఉత్సాహం వస్తుంది. మీకు బాగా నచ్చుతున్న, మీరు ఎంజాయ్ చేస్తున్న వ్యాయామాలేంటో చూడండి. వాటన్నింటినీ కలిపి ఒక రొటీన్ తయారుచేసుకోండి. వాటి ప్రకారం వ్యాయామం చేసుకుంటూ వెళ్లండి. సులువుగా అనిపిస్తుంది.