Lower Blood Pressure : బీపీ ని తగ్గించే అద్భుతమైన పానీయాలు

సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాల్టెడ్ స్నాక్స్ ఏవైనా అదనపు ఉప్పునుఇచ్చేవే. బీపీ కంట్రోల్ లో ఉండాలంటేఇలాంటి రెడీ టు ఈట్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది.

Lower Blood Pressure

Lower Blood Pressure : చిప్స్.. ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువగా ఉండే రెడీ టు ఈట్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, అత్యధిక ఉప్పు… ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాల్లో ముఖ్యమైనవి ఇవే అవుతున్నాయి. వీటికి తోడు ఎక్సర్ సైజ్ లేకపోవడం, ఒబెసిటీ, డయాబెటిస్. అందుకే రక్తనాళాలు, గుండె, గుండె కండరం అనారోగ్యం పాలవుతున్నాయి. ఇలాంటి శరీర పరిస్థితిలో సులువుగా రక్తంలో పీడనం పెరిగి హైపర్ టెన్షన్ సమస్య వస్తున్నది.

READ ALSO : Lower Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే రోజువారీ పానీయాలు ఇవే ?

బీపీ పెరిగితే అన్నీ చిక్కులే

రక్తనాళాల్లో రక్తం ఒక క్రమమైన పీడనంతో ప్రసరణ చెందుతుంది. అన్ని శరీర భాగాల నుంచి గుండెకు చేరేటప్పుడు ఎక్కువ పీడనంతోనూ (సిస్టోలిక్ ప్రెషర్), గుండె నుంచి శరీర భాగాలకు రక్తం వచ్చేటప్పుడు తక్కువ పీడనంతోనూ (డయాస్టోలిక్ ప్రెషర్) ప్రసరణ చెందుతుంది. సాధారణ రక్తపీడనం 120/80 గా ఉంటుంది. దీనిలో సిస్టోలిక్ ప్రెషర్ 120, డయాస్టోలిక్ ప్రెషర్ 80. ఇంతకన్నా ఎక్కువైతే రకరకాల కాంప్లికేషన్లు వస్తాయి.

గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్… ఇలాంటి జబ్బులన్నింటికీ ప్రధాన కారణం బీపీ పెరగడమే. అందుకే బీపీ కంట్రోల్ లో ఉంటే చాలావరకు ఇతర ప్రమాదకరమైన జబ్బులను నివారించొచ్చు.

READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

నార్మల్ బీపీ కోసం…

సోడియం (ఉప్పు) ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాల్టెడ్ స్నాక్స్ ఏవైనా అదనపు ఉప్పునుఇచ్చేవే. బీపీ కంట్రోల్ లో ఉండాలంటేఇలాంటి రెడీ టు ఈట్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది.

ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం, జీవనశైలి సరిచేసుకోవడంతో పాటు కొన్ని రకాల పానీయాలు తీసుకుంటే హైపర్ టెన్షన్ లేదా హై బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్టులు.

READ ALSO : Stroke Risk : పక్షవాతం ముప్పుకు అధిక బరువు, రక్తపోటు అతిపెద్ద కారణాలా ?

ఉసిరి అల్లం జ్యూస్ : ఉసిరి వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. అందుకే ఇది బీపీ రావడాన్ని, పెరగడాన్ని నిరోధించగలుగుతుంది. ఇక అల్లంలో రక్తనాళాలను డైలేట్ చేసే పదార్థాలు ఉంటాయి. అందువల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉండటం వల్ల రక్తపీడనం (బీపీ) కూడా నార్మల్ గా ఉంటుంది.

కొత్తిమీర విత్తనాల నీళ్లు : కొత్తిమీరలో ఉండే పదార్థాలు డైయురెటిక్ గా పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలో అదనంగా ఉండే సోడియం బయటికి వెళ్లిపోతుంది. అందువల్ల బీపీ పెరగకుండా ఉంటుంది.

బీట్ రూట్ టొమాటో జ్యూస్ : బీట్ రూట్ లో నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. నైట్రేట్ కి బీపీ తగ్గించే గుణం ఉంటుంది. నైట్రేట్ నుంచి ఉత్పత్తయ్యేనైట్రిక్ ఆక్సైడ్ ఎండోథీలియల్ ఫంక్షన్ ని సరిచేస్తుంది. టొమాటోల లోని పదార్థాలు కూడా బీపీ మెరుగ్గా ఉండేందుకు సహకరిస్తాయి. వీటిలోనిలైకోపీన్, బీటా కెరొటిన్, విటమిన్ ఇ లాంటి కెరొటినాయిడ్స్ సమర్థవంతమైన యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని చైతన్యరహితం చేస్తాయి. సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రెండూ కూడా మెరుగ్గా ఉంటాయి.

READ ALSO : Ginger Juice : అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలను తగ్గించే అల్లం రసం!

ఈ పానీయాలలో ఏదో రకమైన దాన్ని రోజుకొకసారి తీసుకున్నా చాలు. రక్తప్రసరణ సజావుగా జరగడానికీ, బీపీ కంట్రోల్ లో ఉండటానికి తోడ్పడుతాయి. అయితే, రెగులర్ ఎక్సర్ సైజ్, ఆరోగ్యకరమైన ఆహారం జీవనశైలిలో భాగం చేసుకోవడం తప్పనిసరి.