Eat More Seafood : సముద్రపు చేపలను ఎక్కువగా తినేవారు తెలివిగా, ఆరోగ్యంగా ఉంటారా?
100 గ్రా సముద్రపు చేప మాంసంలో మాంసకృత్తులు 20గ్రా, క్యాలరీలు 200క్యాలరీలు, కొవ్వు 12 గ్రా, కొలెస్టరాల్ 60గ్రా, సోడియం 60గ్రా, పొటాషియం 380గ్రా, ఒమేగా 3 1.5గ్రా ఉంటుంది.

Are people who eat more seafood smarter and healthier?
Eat More Seafood : రుచికి మాంసం మాత్రమే బెటర్ అనుకునే వారికి రుచితోపాటు, ఆరోగ్యానికి ఇప్పుడు చేపలు మాత్రమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో మాంసకృత్తులు, ఇనుము, ఖనిజ లవణాలు, అయోడిన్ , ఎ, డి విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. మాంసకృత్తులు అధికంగా ఉండి , క్యాలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గటం ఈజీగా ఉంటుంది.
100 గ్రా సముద్రపు చేప మాంసంలో మాంసకృత్తులు 20గ్రా, క్యాలరీలు 200క్యాలరీలు, కొవ్వు 12 గ్రా, కొలెస్టరాల్ 60గ్రా, సోడియం 60గ్రా, పొటాషియం 380గ్రా, ఒమేగా 3 1.5గ్రా ఉంటుంది. సముద్రపు చేపలు తినటం వల్ల మానవ నాడీ వ్యవస్ధలోని నాడీ కణజాలం ఏరాటుకు కొవ్వు అమ్లాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒమేగా 3 నూనె ఉపయోగించటం వల్ల నాడీ వ్యవస్ధ జాగృత పడి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఏకాగ్రత లోపాలతో బాధపడేవారు చేపల నూనెలను వాడటం వల్ల చురుకు దనాన్ని పెంచు కోవచ్చు.
సముద్ర చేపలను ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరంలో రక్తంలో హెచ్ డిఎల్ స్ధాయిలను పెంచుకోవచ్చు. తద్వారా గుండె జబ్బులు దరిచేరకుండా చూసుకోవచ్చు. మధుమేహుల్లో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉండి హెడిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఒమేగా 3 ఉండే చేపలను ఆహారంలో చేర్చుకుంటే కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు నివారించవచ్చు. రక్తపోటును తగ్గించుకుని రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.