Height Increase : పిల్లలు వయస్సు పెరుగుతున్నా… ఎత్తు పెరగటం లేదా?..

ఎముకల ఎదుగుదలకు అవసరమైన కాల్సియం సమకూరాలంటే సోయా ప్రొడక్ట్స్, సోయా బీన్స్, సోయా మిల్క్ పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చాలి.

Height Increase : పిల్లలు వయస్సు పెరుగుతున్నా… ఎత్తు పెరగటం లేదా?..

Childrens Hight

Updated On : February 10, 2022 / 6:49 PM IST

Height Increase : ఎదుగుతున్న వయస్సు పిల్లల్లో ఎత్తు సమస్య ప్రధానంగా ఉంటుంది. వయస్సు పెరుగుతున్నా చాలా మంది అందుకు తగినట్లుగా ఎత్తు పెరగరు. ఇది తల్లిదండ్రులలో ఆందోళన రేకెత్తిస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు వయస్సుకు తగిన ఎత్తు పెరగటంలేదని బాధపడుతుంటారు. ఇందుకోసం దుకాణాల్లో లభించే వివిధ రకాల ప్రొటీన్ పౌడర్లను కొనుగోలు చేసి వాటిని తాపుతుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

అయితే పిల్లలు వయస్సుకు తగినట్లు ఎత్తు పెరగటం అన్నది తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. పిల్లలు సహజ సిద్ధంగా ఎత్తు పెరగాలంటే ఆహారంలో తగినన్ని న్యూట్రీషియన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. చేపలు,రొయ్యలు వంటి విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను ఇవ్వటం ద్వారా బరువుతోపాటు, ఎత్తు ను పెంచేందుకు అవకాశం ఉంటుంది. విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా లభించే కోడిగుడ్డును రోజు వారిగా పిల్లలకు అందించాలి. దీని వల్ల ఎముకలకు తగినంత కాల్షియం అందుతుంది.

ఎముకల ఎదుగుదలకు అవసరమైన కాల్సియం సమకూరాలంటే సోయా ప్రొడక్ట్స్, సోయా బీన్స్, సోయా మిల్క్ పిల్లల రెగ్యులర్ డైట్ లో చేర్చాలి. పాల ఉత్పత్తులై జున్ను లాంటి వి పిల్లలకు ఇవ్వాలి. ఆకుకూరలు, క్యారెట్ వంటి వాటిని రోజు వారి ఆహారంలో భాగం చేయాలి. దీని వల్ల పిల్లలకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు ఉపకరిస్తాయి. చికెన్ కూడా పిల్లల ఎత్తు పెంచటానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగపడాయి.

రోజువారి తీసుకునే ఆహారంలో బచ్చలకూర, క్యారెట్, బెండకాయ సోయాబీన్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ఎత్తు పెరగటానికి దోహదపడతాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ ఉండటం వలన ఇవి పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి. ఆహారంతోపాటు పిల్లలు రోజు వారిగా వ్యాయామాలు చేసేలా ప్రోత్సహించాలి. సైకిల్ తొక్కటం, స్కిప్పింగ్ ఆడటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది.