Genital Health : ఆ పానీయాలతో జాగ్రత్త, అతిగా తీసుకుంటే జననేంద్రియ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం!
టీలో కెఫిన్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. సాధారణ టీలో తక్కువ కెఫిన్ ఉండవచ్చు, కానీ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో ఎక్కువ స్థాయిలో ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చెబుతుంది.

Be careful with those drinks, risk of harming genital health if consumed excessively!
Genital Health : స్త్రీ ఆరోగ్యంలో యోని ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యమైనది. కొన్ని ఆహారాలు , పానీయాలు జననేంద్రియ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. హాని కలిగిస్తాయి. కొన్ని పానీయాల అధిక వినియోగం యోని ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనాల్లో సైతం రుజువైంది. ఇలాంటి వాటి వల్ల యోనిలో దురద, పొడిబారటం, మంటను అనుభవించటం వంటి సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి, పరిశుభ్రత విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో, ఆహారాలు, పానీయాల విషయంలో అంతే జాగ్రత్తలు పాటించాలి.
పసుపు వాడకం తగ్గింటచటం ; బరువు తగ్గడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి లేదా రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా మంది పసుపు నీరు లేదా పసుపు టీని ఎక్కువగా తాగుతారు. దీన్ని అతిగా తీసుకోవడం హానికరమని గుర్తుంచుకోవాలి. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనత సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది పునరుత్పత్తి ఆరోగ్యం మరియు సంతానోత్పత్తికి కూడా ఆటంకం కలిగిస్తుంది.
కాఫీ అతిగా తాగటం వల్ల ఇబ్బందులే ; కాఫీ ఎక్కువగా తాగడం వల్ల మీ జననేంద్రియ ప్రాంతానికి హాని కలుగుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. కాఫీలో కెఫిన్ ఉన్నందున, చాలా ఎక్కువ శరీరం మరియు యోని యొక్క pH స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. కాఫీ వినియోగం డీహైడ్రేషన్‌కు కారణమౌతుంది. ఇది యోని లోపలి పొరను దెబ్బతీయటంతోపాటు, మూత్రాన్ని మరింత ఆమ్లంగా మారుస్తుంది.
హెర్బల్ టీ ; లవంగాలు, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మరియు దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడిన సాంప్రదాయ కషాయాలు జలుబు , దగ్గును నివారించడానికి లేదా రోగనిరోధక శక్తిని పెంచడానికి వినియోగిస్తారు. కానీ, అవి మీ యోని పీహెచ్ ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే అవి సహజంగా వెచ్చగా ఉంటాయి. మీ జననేంద్రియ ఆరోగ్యం కోసం దీన్ని అతిగా చేయవద్దు.
టీ ఎక్కువసార్లు సేవించటం ; టీలో కెఫిన్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. సాధారణ టీలో తక్కువ కెఫిన్ ఉండవచ్చు, కానీ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో ఎక్కువ స్థాయిలో ఉంటుందని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చెబుతుంది. రోజులో ఎక్కువ టీ తాగితే, డయేరియా, డీహైడ్రేషన్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. . అలాగే జననేంద్రియాలను పొడిగా మార్చే అవకాశం ఉంటుంది.
తీపి పానీయాలు ; శీతల పానీయాలు, కృత్రిమంగా తీపి సోడాలను తాగటం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి జీవక్రియపై ప్రభావం చూపుతాయి. పేలవమైన పేగు ఆరోగ్యం జననేంద్రియ ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. తీపి ఆహారాలు లేదా పానీయాల అధిక వినియోగం రోగనిరోధక శక్తిని తగ్గిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.