PV Sindhu : BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్న పీవీ సింధు.. వరల్డ్ నంబర్ 2 పై విజయం
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) అదరగొడుతోంది. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమీతో సతమతమైన..

BWF World Championships PV Sindhu stuns world no 2 Wang Zhi Yi
PV Sindhu : BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొడుతోంది. గత కొన్నాళ్లుగా ఫామ్ లేమీతో సతమతమైన సింధు (PV Sindhu) ప్రతిష్ఠాత్మక టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు ప్రపంచ రెండో ర్యాంకర్, చైనాకు చెందిన షట్లర్ వాంగ్ జి యిపై విజయం సాధించింది.
48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు వరుస సెట్‌లలో 21-19, 21-15 తేడాతో వాంగ్ పై గెలుపొందింది. ఈ క్రమంలో వాంగ్ పై ముఖాముఖీ పోరులో తన రికార్డును 3-2తో మెరుగుపరచుకుంది. ఇక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమవర్ధనితో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో ఆరో పతకం సింధు సొంతమవుతుంది. ఈ టోర్నీలో సింధు.. 2013, 2014లో క్యాంస్య పతకాలు సాధించగా, 2017, 2018 రజత పతకాలు అందుకుంది. ఇక 2019లో స్వర్ణ పతకం సాధించింది.
గతంలో సింధు, కుసుమవర్ధనిలు ఒకే ఒక సారి తలపడ్డారు. ఉబెర్ కప్ గ్రూప్ స్టేజ్‌లో జరిగిన నాటి మ్యాచ్‌లో 21-15, 21-17 తేడాతో సింధు విజయం సాధించింది.