Asia cup 2025 : టీమ్ మొత్తం కాదు.. ఎవరికి వారే.. సెపరేట్ గా దుబాయ్ వెళ్లనున్న ప్లేయర్లు.. అదేంటంటే బీసీసీఐ చెప్పిన ఆన్సర్ ఇదే..
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 (Asia cup 2025) ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో భారత జట్టు..

Asia cup 2025 Indian Cricket Team Members Won't Fly Together To Dubai
Asia cup 2025 : సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్ 2025 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ఇప్పటికే సెలక్టర్లు ఎంపిక చేశారు. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఆడనుంది.
ఈ మెగా టోర్నీ (Asia cup 2025) కోసం భారత ఆటగాళ్లు సెప్టెంబర్ 4న బయలుదేరి వెళ్లనున్నారు. అయితే.. ఆటగాళ్లు అందరూ ఒకే సారి కాకుండా ఎవరికి వారు తమ తమ సొంత నగరాల నుంచి దుబాయ్‌కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి భారత జట్టు ప్రాక్టీస్ మొదలెట్టనుంది.
సాధారణంగా విదేశాల్లో ఆడేందుకు వెళ్లేటప్పుడు భారత జట్టు మొత్తం ముంబైకి చేరుకుని అక్కడి నుంచి ప్రయాణిస్తూ వస్తోంది. అయితే.. ఈ సారి మాత్రం కాస్త భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
‘అనుకూలత ప్రకారం కొంది మంది ప్లేయర్లు ముంబై నుంచే వెళతారు. అయితే.. అందరిని ముంబైకి పిలవడంలో అర్థం లేదు. పైగా ఇతర అంతర్జాతీయ వేదికలతో పోల్చినప్పుడు దుబాయ్ చాలా దగ్గరే. కాబట్టి అందరికి తమ ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాం.’ అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
Mohammed Shami : భారతదేశంలో ముస్లిం క్రికెటర్లను భిన్నంగా చూస్తారా? షమీ ఏమన్నాడంటే.?
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్‌దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.
టీమ్ఇండియా షెడ్యూల్..
ఆసియా కప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఇక క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగనుంది. లీగ్ దశలో భారత్ తన చివరి మ్యాచ్‌ను ఒమన్‌తో సెప్టెంబర్ 19న జరగనుంది.