Mohammed Shami : భారతదేశంలో ముస్లిం క్రికెటర్లను భిన్నంగా చూస్తారా? షమీ ఏమన్నాడంటే.?
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రదర్శన..

Are Muslim cricketers treated differently in India Mohammed Shami
Mohammed Shami : టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగిలిన మ్యాచ్‌ల్లో ఎలాంటి ప్రదర్శన చేసినప్పటికి కూడా ఐసీసీ మెగా టోర్నీలంటే మాత్రం చెలరేగిపోతాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో 24 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అయితే.. ఎందుకనో ఈ స్టార్ పేసర్ గతకొన్నాళ్లుగా సెలక్టర్ల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోతున్నాడు. ఇటీవల ప్రకటించిన ఆసియా కప్ 2025 జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇదిలా ఉంటే.. తన ప్రదర్శనతో టీమ్ఇండియాకు విజయాలు అందించినా కూడా కొన్నిసార్లు షమీ (Mohammed Shami) సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 2021 టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత్ ఓడిపోయిన సమయంలో సోషల్ మీడియాలో అతడిని కొందరు లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా తనపై వచ్చే ట్రోలింగ్ పై అతడు స్పందించాడు.
Asia Cup 2025 : ఆసియా కప్‌లో ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు.. వీరేంద్ర సెహ్వాగ్
తాను ముస్లింను అయినందున కొంత మంది తనను లక్ష్యం చేసుకుంటారని, కానీ అలాంటి ట్రోలింగ్‌ను తాను పట్టించుకోనని షమీ చెప్పాడు. తాను యంత్రాన్ని కాదన్నాడు. తనకు మంచి, చెడ్డ రోజులు ఉంటాయన్నాడు. మ్యాచ్‌ల్లో కొన్ని సార్లు అత్యుత్తమ ప్రదర్శన చేయవచ్చు. మరికొన్ని సార్లు విఫలం కావొచ్చునని చెప్పాడు. తాను దేశం కోసం ఆడుతున్నానని ఎల్లప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నం చేస్తానన్నాడు.
తాను సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ కంటే.. జట్టు విజయాలు, వికెట్లు తీయడంపైనే ఎక్కువగా దృష్టి పెడతానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లు గెలవడమే అన్నింటికన్నా ముఖ్యమైనదని అన్నాడు. ఇక నిజమైన అభిమానులు ఎప్పుడూ అలాంటి పనులు చేయరన్నాడు. జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
WCL 2025 : మాజీ క్రికెటర్లా.. మజాకానా.. డబ్ల్యూసీఎల్ అరుదైన ఘనత..
షమీ భారత్ తరుపున 64 టెస్టుల్లో 229 వికెట్లు, 108 వన్డేల్లో 206 వికెట్లు, 25 టీ20ల్లో 27 వికెట్లు తీశాడు.