WCL 2025 : మాజీ క్రికెటర్లా.. మజాకానా.. డబ్ల్యూసీఎల్ అరుదైన ఘనత..
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లీగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా..

WCL 2025 Becomes World's Second Most Watched Cricket League
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 లీగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రెండో అత్యధిక వ్యూవర్ షిప్ సొంతం చేసుకున్న లీగ్‌గా నిలిచింది. డబ్ల్యూసీఎల్ (WCL) 2025 లీగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 409 మిలియన్ల వ్యూవర్స్ చూశారు. ఇది గత సీజన్‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ లీగ్‌లో భారత్, పాక్ మ్యాచ్‌లు జరిగి ఉంటే వీక్షకుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
డబ్ల్యూసీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో ప్రేక్షకులు చూశారట. దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ పలు దైపాక్షిక సిరీసుల కంటే అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ తెచ్చుకుందట.
Alex Hales : టీ20 క్రికెట్‌లో క్రిస్‌గేల్ రికార్డును సమం చేసిన అలెక్స్ హేల్స్..
ఇక ఈ లీగ్‌లో యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ బరిలోకి దిగింది. సెమీస్‌కు చేరుకుంది. అక్కడ పాకిస్థాన్ ఛాంపియన్స్ ఎదురైంది. ఇటీవల ఉద్రిక్తతల కారణంగా పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన యువీ జట్టు మ్యాచ్ నుంచి వైదొగిలింది. గ్రూప్ స్టేజీలోనూ పాక్‌తో భారత్ ఆడలేదు.
ఫైనల్‌లో ఏబీడీ సెంచరీ..
ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలిచింది. ఈ సీజన్‌లో ఏబీ డివిలియర్స్ మెరుపులు మెరిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో శతకంతో చెలరేగి తన జట్టుకు ట్రోఫీని అందించాడు. భారతదేశంలోనూ పెద్ద సంఖ్యలో ఏబీడీకి అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అతడు ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
Mohammed Shami : రిటైర్‌మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు.. నా రిటైర్‌మెంట్ ఎప్పుడంటే?
రిటైర్ అయిన ఆటగాళ్లంతా..
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అయిన ఆటగాళ్లు మాత్రమే ఆడుతున్నారు. 2024లో ఈ లీగ్ ప్రారంభమైంది. తొలి సీజన్‌లో యువీ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు రెండు సీజన్లు జరగగా.. ఈ రెండు సీజన్లలోనూ ఆరు జట్లు (భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, విండీస్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్)లు ఆడాయి. ఈ లీగ్ విజయవంతం కావడంతో భవిష్యత్తులో జట్ల సంఖ్య పెరగొచ్చు. రెండు సీజన్లలోనూ మ్యాచ్‌లు అన్ని ఇంగ్లాండ్ వేదికగానే జరిగాయి.