Alex Hales : టీ20 క్రికెట్‌లో క్రిస్‌గేల్ రికార్డును సమం చేసిన అలెక్స్ హేల్స్..
టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్ (Alex Hales) అరుదైన ఘనత సాధించాడు. అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన..

CPL 2025 Alex Hales equals Chris Gayle massive T20 record
Alex Hales : టీ20 క్రికెట్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో అతడు దీన్ని అందుకున్నాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అలెక్స్ హేల్స్(Alex Hales) ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో అతడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ హాఫ్ సెంచరీలను సమం చేశాడు. టీ20 క్రికెట్‌లో అలెక్స్ హేల్స్‌కు ఇది 88వ హాఫ్ సెంచరీ. ఓవరాల్‌గా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో ఐదో స్థానంలో హేల్స్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్ 423 ఇన్నింగ్స్‌ల్లో 113 అర్థశతకాలు సాధించాడు. ఆ తరువాత కోహ్లీ (105), జోస్ బట్లర్ (96), బాబర్ ఆజామ్ (93) లు ఉన్నారు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు వీరే..
* డేవిడ్ వార్నర్ – 423 ఇన్నింగ్స్‌ల్లో 113
* విరాట్ కోహ్లీ – 397 ఇన్నింగ్స్‌ల్లో 105
* జోస్ బట్లర్ – 440 ఇన్నింగ్స్‌ల్లో 96
* బాబర్ అజామ్ – 309 ఇన్నింగ్స్‌ల్లో 93
* క్రిస్ గేల్ – 455 ఇన్నింగ్స్‌ల్లో 88
* అలెక్స్ హేల్స్ – 503 ఇన్నింగ్స్‌ల్లో 88
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు సాధించింది. ఆంటిగ్వా బ్యాటర్లలో జ్యువెల్ ఆండ్రూ(40), కెప్టెన్ ఇమాద్ వసీం(37 నాటౌట్) లు రాణించారు. ట్రిన్‌బాగో బౌలర్లలో మహ్మద్ అమీర్ మూడు వికెట్లు తీశాడు. అకేల్ హోసేన్, ఆండ్రీ రస్సెల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Mohammed Shami : రిటైర్‌మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు.. నా రిటైర్‌మెంట్ ఎప్పుడంటే?
అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో అందుకుంది. ట్రిన్‌బాగో బ్యాటర్లలో అలెక్స్ హేల్స్ ( 55 నాటౌట్; 46 బంతుల్లో 6 ఫోర్లు), కీసీ కార్తీ (60; 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. కెప్టెన్ నికోలస్ పూరన్ (23 నాటౌట్; 11 బంతుల్లో 2 ఫోర్లు) వేగంగా ఆడాడు.