RCB : మూడు నెలల సైలెంట్ తర్వాత ఆర్‌సీబీ పోస్ట్.. ‘బాధపడుతూనే ఉన్నాం.. ఫ్యాన్స్ కోసం ఆర్‌సీబీ కేర్స్..’
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కప్పు కోసం సుదీర్ఘకాలం నిరీక్షించింది. ఎట్టకేలకు 18వ సీజన్‌లో

RCB break 3 month social media silence
RCB : ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కప్పు కోసం సుదీర్ఘకాలం నిరీక్షించింది. ఎట్టకేలకు 18వ సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో బెంగళూరు వేదికగా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. అయితే.. ఈ సంబరాలు విషాదంగా మారాయి. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ఫ్రాణాలు కోల్పోయారు. మరో 50 పైగా గాయపడిన సంగతి తెలిసిందే.
దీంతో కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ నమోదుకావడమే కాకుండా పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
Daniil Medvedev : రష్యా టెన్నిస్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్‌కు భారీ జరిమానా..
కాగా.. ఈ తొక్కిసలాట ఘటనపై జూన్ 5న సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది ఆర్‌సీబీ. ఆ తరువాత సైలెంట్ అయింది. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఆర్‌సీబీ తొలి పోస్టును చేసింది. నాటి తొక్కిసలాట ఘటనను గుర్తు చేసుకుంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ దురదృష్ట ఘటన కారణంగానే ఈ మూడు నెలలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేయలేదని తెలిపింది. ఆర్‌సీబీ కేర్స్ ద్వారా అభిమానులకు అండగా ఉంటామని చెప్పింది.
Dear 12th Man Army, this is our heartfelt letter to you!
𝗜𝘁’𝘀 𝗯𝗲𝗲𝗻 𝗰𝗹𝗼𝘀𝗲 𝘁𝗼 𝘁𝗵𝗿𝗲𝗲 𝗺𝗼𝗻𝘁𝗵𝘀 𝘀𝗶𝗻𝗰𝗲 𝘄𝗲 𝗹𝗮𝘀𝘁 𝗽𝗼𝘀𝘁𝗲𝗱 𝗵𝗲𝗿𝗲.
The Silence wasn’t Absence. It was Grief.
This space was once filled with energy, memories and moments that you… pic.twitter.com/g0lOXAuYbd
— Royal Challengers Bengaluru (@RCBTweets) August 28, 2025
‘ప్రియమైన 12వ మ్యాన్ ఆర్మీ(ఫ్యాన్స్). ఇది మీకు మా హృదయపూర్వక లేఖ! ఇక్కడ మేము చివరిగా పోస్ట్ చేసి మూడు నెలలు అవుతోంది. మీకు దూరంగా ఉండాలని ఇలా చేయలేదు. దుఃఖంతోనే ఇలా చేశాం. ఒకప్పుడు ఈ వేదిక ఉత్సాహంగా, మధుర జ్ఞాపకాలతో, మీరు ఆస్వాదించిన క్షణాలతో కనిపించేది. కానీ జూన్ 4వ తేదీన చోటు చేసుకున్న ఘటన అంతా మర్చేసింది. ఆ రోజు మా హృదయం ముక్కలైంది. అప్పటి నుంచి నిశ్శబ్దమే మా మార్గంగా మారింది. ఈ సమయంలో ఎంతో బాధపడ్డాం. ఎన్నో మాటలు విన్నాం. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం.
Mohammed Shami : రిటైర్‌మెంట్ పై షమీ కీలక వ్యాఖ్యలు.. నా రిటైర్‌మెంట్ ఎప్పుడంటే?
ఈ క్రమంలోనే ఆర్‌సీబీ కేర్స్ పురుడు పోసుకుంది. అభిమానులకు అండగా నిలిచేందుకు మా ఈ ప్రయత్నం. అందుకోసం సరైన వేదికను సిద్ధం చేశాం. కేవలం సంబరాలు మాత్రమే కాదు అభిమానుల గురించి జాగ్రత్తలు ఇందులో భాగం అవుతాయి. కర్ణాటక గొప్పదనాన్ని కొనసాగించేందుకు ఎల్లవేళలా ముందు ఉంటాం.’ అని ఆర్‌సీబీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.