PKL 12 : నేటి నుంచే ప్రో కబడ్డీ 12వ సీజన్.. తొలి మ్యాచ్‌లో తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ ఢీ.. ఏడేళ్ల తరువాత ఆతిథ్యం ఇస్తున్న విశాఖ..
కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ (PKL 12) నేటి నుంచి ప్రారంభం కానుంది.

Pro Kabaddi League season 12 starts from today
PKL 12 : కబడ్డీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసింది. ఇప్పటికే విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుంది. నేటి (శుక్రవారం ఆగస్టు 29) నుంచి 12వ సీజన్ (PKL 12) ప్రారంభం కానుంది. 12 జట్లు.. తెలుగు టైటాన్స్, పట్నా పైరేట్స్, యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్, దబంగ్ దిల్లీ, గుజరాత్ జెయింట్స్, బెంగళూరు బుల్స్, హరియాణా స్టీలర్స్, జైపుర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్, యు ముంబా పుణెరి పల్టాన్ లు కప్పు కోసం పోటీపడనున్నాయి.
వైజాగ్‌లోని రాజీవ్ గాందీ ఇండోర్ స్టేడియంలో ఆరంభ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం నాలుగు నగరాల్లో.. వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఇక రెండో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో పుణెరి పల్టాన్ ఆడనుంది. ఏడేళ్ల విరామం తరువాత విశాఖపట్నంలో ఈ లీగ్ జరుగుతోంది.
Mohammed Shami : భారతదేశంలో ముస్లిం క్రికెటర్లను భిన్నంగా చూస్తారా? షమీ ఏమన్నాడంటే.?
లీగ్ దశలో 108 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు కూడా 18 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సారి నుంచి పాయింట్ల విధానాన్ని కాస్త సవరించారు. మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు ఇవ్వనుండగా, ఓడిపోయిన జట్టుకు పాయింట్లు ఏమీ రావు. ఇంతకముందు గెలిచిన జట్టుకు 5 పాయింట్లు, మ్యాచ్ టై అయితే రెండు జట్లకు మూడు పాయింట్లు, 7 కన్నా తక్కువ తేడాతో ఓడిన జట్టుకు ఓ పాయింట్ ఇచ్చేవారు.
మ్యాచ్‌లు టై అయితే..
ఈ సీజన్‌లో మ్యాచ్‌లు టై అయిన సందర్భంలో ప్రత్యేక నిబంధనలతో 5 రెయిడ్‌ల ఘాటౌట్‌లను నిర్వహిస్తారు. అప్పుడు కూడా రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉంటే గోల్డెన్ రెయిడ్ తో విజేతను నిర్ణయిస్తారు. అప్పటికి కూడా ఫలితం రాకుంటే టాస్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.
విశాఖలో సెప్టెంబర్ 11 వరకు..
నేటి నుంచి సెప్టెంబర్ 11 వరకు విశాఖపట్నంలో మ్యాచ్‌లు జరగనునున్నాయి. ఆ తరువాత సెప్టెంబర్ 12 నుంచి 28 వరకు జైపూర్‌లో, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10 వరకు చెన్నైలో, అక్టోబర్ 11 నుంచి 23 వరకు ఢిల్లీలో మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా.. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలను ఇంకా ఖరారు చేయలేదు.
వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
ఆగస్టు 29న – తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్
ఆగస్టు 29న – బెంగళూరు బుల్స్ vs పుణెరి పల్టన్
ఆగస్టు 30న – తెలుగు టైటాన్స్ vs యూపీ యోధాస్
ఆగస్టు 30న – యు ముంబా vs గుజరాత్ జెయింట్స్
ఆగస్టు 31న – తమిళ్ తలైవాస్ vs యు ముంబా
ఆగస్టు 31న – బెంగాల్ వారియర్జ్ vs హర్యానా స్టీలర్స్
సెప్టెంబర్ 1న – పట్నా పైరేట్స్ vs యూపీ యోధాస్
సెప్టెంబర్ 1న – పుణెరి పల్టన్ vs గుజరాత్ జెయింట్స్
సెప్టెంబర్ 2న – దబాంగ్ ఢిల్లీ K.C. vs బెంగళూరు బుల్స్
Asia Cup 2025 : ఆసియా కప్‌లో ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు.. వీరేంద్ర సెహ్వాగ్
సెప్టెంబర్ 2న – జైపూర్ పింక్ పాంథర్స్ vs పట్నా పైరేట్స్
సెప్టెంబర్ 3న – పుణెరి పల్టన్ vs బెంగాల్ వారియర్జ్
సెప్టెంబర్ 3న – హర్యానా స్టీలర్స్ vs యు ముంబా
సెప్టెంబర్ 4న – జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్
సెప్టెంబర్ 4న – పుణెరి పల్టన్ vs దబాంగ్ ఢిల్లీ K.C.
సెప్టెంబర్ 5న – యు ముంబా vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 5న – హర్యానా స్టీలర్స్ vs యూపీ యోధాస్
సెప్టెంబర్ 6న – పట్నా పైరేట్స్ vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 6న – తమిళ్ తలైవాస్ vs గుజరాత్ జెయింట్స్
సెప్టెంబర్ 7న – బెంగాల్ వారియర్జ్ vs తెలుగు టైటాన్స్
సెప్టెంబర్ 7న – దబాంగ్ ఢిల్లీ K.C. vs జైపూర్ పింక్ పాంథర్స్
సెప్టెంబర్ 8న – హర్యానా స్టీలర్స్ vs బెంగళూరు బుల్స్
సెప్టెంబర్ 8న – పుణెరి పల్టన్ vs పట్నా పైరేట్స్
సెప్టెంబర్ 9న – దబాంగ్ ఢిల్లీ K.C. vs బెంగాల్ వారియర్జ్
సెప్టెంబర్ 9న – గుజరాత్ జెయింట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్
సెప్టెంబర్ 10న – యు ముంబా vs తెలుగు టైటాన్స్