Aaryavir Sehwag : వార్నీ తండ్రే అనుకుంటే.. కొడుకు అంతకు మించి ఉన్నాడుగా.. జూనియర్ సెహ్వాగ్ బ్యాటింగ్ చూశారా?
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag ) ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో అరంగ్రేటం చేశాడు.

DPL 2025 Aaryavir Sehwag smashes consecutive fours Navdeep Saini bowling
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag ) ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)లో అరంగ్రేటం చేశాడు.
తొలి మ్యాచ్‌లోనే దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. అతడు ఆడిన విధానం వీరేంద్ర సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చింది.
ఆర్యవీర్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డీపీఎల్‌లో ఆర్యవీర్ (Aaryavir Sehwag) సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. తన తండ్రి లాగా తొలి బంతికే బౌండరీ కొట్టలేదు. మొదటి నాలుగు బంతులను ఆచితూచి ఆడాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే తీశాడు. అయితే.. ఆ తరువాత తన దూకుడు చూపించాడు.
Ashwin : ఇదేం సిత్రమో.. అశ్విన్ మొదటి, ఆఖరి ఐపీఎల్ వికెట్లు ఒకే రోజున ఇంకా..
Classy batting! Aaryavir Sehwag smashes consecutive fours. 💥 🏏
Aaryavir Sehwag | East Delhi Riders | Central Delhi Kings | Anuj Rawat | Jonty Sidhu | #DPL2025 #DPP #AdaniDPL2025 #Delhi pic.twitter.com/08KwyxqPeK
— Delhi Premier League T20 (@DelhiPLT20) August 27, 2025
భారత పేసర్ నవదీప్ సైనీ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. తొలి బౌండరీని ఆఫ్-సైడ్ దిశగా బాదిన ఆర్యవీర్.. రెండో బౌండరీని చక్కటి లాఫ్టెడ్ డ్రైవ్‌తో రాబట్టాడు. ఆ తరువాత రౌనక్ వాఘేలా వేసిన ఓవర్‌లోనూ అతడు వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే.. అదే ఓవర్‌లో మరోషాట్‌కు యత్నించి మయాంక్ రావత్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఆర్యవీర్ 16 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేశాడు.
CPL 2025 : ఒక్క బంతికే 22 పరుగులు.. ఎలా వచ్చాయంటే..?
ఆర్యవీర్ బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతడి తండ్రిలాగానే అతడు కూడా నిర్భయంగా ఆడుతున్నాడని, త్వరలోనే అతడిని టీమ్ఇండియాలో చూడాలని అనుకుంటున్నట్లు కామెంట్లు చెబుతున్నారు.