Rohit Sharma : రోహిత్ శర్మకు ఎవరి బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంటే ఇష్టమో తెలుసా?
టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పవర్ హిట్టర్లలో రోహిత్ శర్మ (Rohit Sharma) ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు

Do you know Rohit Sharma likes hitting sixes against which bowler
Rohit Sharma : టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పవర్ హిట్టర్లలో రోహిత్ శర్మ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 637 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) స్ట్రైక్ రేటు 93 కాగా టీ20ల్లో 140 ఫ్లస్ స్ట్రైక్‌రేటు కలిగి ఉన్నాడు.
ఏ బౌలర్ బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టేందుకు ఎక్కువ ఇష్టపడతావు అనే ప్రశ్న ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ కు ఎదురైంది. దీనికి రోహిత్ చెప్పిన సమాధానం అందరిని ఉత్సాహపరిచింది. ప్రతి బౌలర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం అంటే తనకు చాలా ఇష్టం అని హిట్‌మ్యాన్ తెలిపాడు.
Ravichandran Ashwin : ఐపీఎల్ రిటైర్మెంట్ పై అశ్విన్ కామెంట్స్.. ధోని లాంటి వ్యక్తి..
నిజం చెబుతున్నాను. ప్రత్యేకంగా ఏ ఒక్క బౌలర్ అని చెప్పలేను. అందరి బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంటే ఇష్టం. నా మైండ్ సెట్ అదే. బంతి పడితే బాదడమే.. బౌలర్ ఎవరు అనేది చూడను. అని రోహిత్ శర్మ అన్నాడు.
Question: One bowler you would always love to hit for six?
Rohit Sharma: “Honestly, everyone! I’d love to hit all of them. There’s no particular one. My mindset is always the same—I just want to hit, doesn’t matter who’s in front of me.”🔥
The Shana for a reason @ImRo45 🐐 pic.twitter.com/NZgfBrtiXx
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 28, 2025
38 ఏళ్ల రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అతడి నాయకత్వంలోనే భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2024, ఛాంపియన్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది.
చివరి సారిగా ఐపీఎల్ 2025 సీజన్‌లోనే రోహిత్ శర్మ మైదానంలో కనిపించాడు. ఈ సీజన్‌లో హిట్‌మ్యాన్ 15 మ్యాచ్‌ల్లో 22 సిక్సర్లు బాదాడు. మొత్తంగా 418 పరుగులు సాధించాడు.
అక్టోబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ భారత్ తరుపున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.