Mood of the Nation : ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిది..? ఎన్డీయేకు ఎన్ని సీట్లొస్తాయి.. ఆసక్తికర సర్వే

Mood of the Nation : దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే సర్వే ప్రకారం.. 324 సీట్లతో

Mood of the Nation : ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిది..? ఎన్డీయేకు ఎన్ని సీట్లొస్తాయి.. ఆసక్తికర సర్వే

Mood of the Nation

Updated On : August 29, 2025 / 10:49 AM IST

Mood of the Nation : దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా దాదాపు మూడేళ్ల సమయం ఉంది. 2024లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో.. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కొనసాగుతున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తుందా..? ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకుందా..? అనే విషయాలపై ఇండియా టుడే సీ ఓటర్ ఆధ్వర్యంలో ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (Mood of the Nation) సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Also Read: Shamshabad Airport Bullets: బాబోయ్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం.. ప్రయాణికుడి నుంచి స్వాధీనం..

దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే సర్వే ప్రకారం.. 324 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తేలింది. ఎన్టీయేకు 2024లో 293 ఎంపీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఆ సంఖ్య 324కు చేరొచ్చునని సర్వే అంచనా వేసింది. బీజేపీ సొంతంగా 260 సీట్లు సాధిస్తుందని.. 2024 ఎన్నికల కంటే ఇరవై సీట్లు పెరుగుతాయని తెలిపింది. అయితే, బీజేపీ ఒంటరిగా పోటీచేసి మెజార్టీ (272సీట్లు) సాధించే అవకాశం లేదని సర్వే తేల్చింది. ప్రతిపక్ష ఇండియా కూటమి 208 సీట్లను గెలచుకోవచ్చని తెలిపింది.

సర్వే ప్రకారం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీయే ఓటు షేర్ 47శాతం (2024) నుంచి 50శాతంకు పెరిగే అవకాశం ఉందని, ఇండియా కూటమి ఓటు షేర్ 39శాతం నుంచి 44 శాతంకు పెరుగుతుందని అంచనా వేసింది. అయినా ఈ ఓటు షేర్ పెరుగుదల ఇండియా కూటమికి లాభం చేకూర్చదని సర్వే అంచనా వేసింది.

 

సర్వే సాగిందిలా..

2025 జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు ఇండియా టుడే సీ ఓటర్ ఆధ్వర్యంలో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే కొనసాగింది. దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో 54,788 మంది అభిప్రాయాలు సేకరించారు. అలాగే గత 24వారాల్లో 1,52,038 మంది నుంచి మొత్తం 2,06,826 మంది ఓటర్ల అబిప్రాయాల ప్రకారం సర్వే రిపోర్ట్ రెడీ చేశారు.

ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్నారు. తదుపరి ప్రధానిగా మోదీకి 51.5శాతం, రాహుల్ గాంధీని 24.7శాతం మంది ఇష్టపడ్డారు. సర్వే రిపోర్టు ప్రకారం.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 46.7శాతం ఓటు షేర్, ఇండియా కూటమికి 40.9శాతం ఓటు షేర్, ఇతరులకు 12.4శాతం ఓటు షేర్ రావొచ్చునని సర్వే తేల్చింది. అయితే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా అయితే.. బీజేపీ 40.6శాతం ఓటు షేరుతో 260 సీట్లు, కాంగ్రెస్ 20.8 శాతం ఓటు షేరుతో 98సీట్లు గెలుస్తుందని సర్వే పేర్కొంది.