Reducing Diabetes : మధుమేహం తగ్గించటంలో ఔషధంగా కాకరకాయ రసం !

కాకరలో క్యాటెచిన్, గల్లిక్ యాసిడ్, ఎపికాటెచిన్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి మరియు పొటాషియం, ఫోలేట్, జింక్ ,ఐరన్ వంటి ఖనిజాల భారీ నిల్వలను కలిగి ఉంది.

Reducing Diabetes : రక్తంలో అధికంగా గ్లూకోజ్ స్ధాయిలు ఉండటాన్ని మధుమేహం అని అంటారు. మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మదుమేహవ్యాధి అధికంగా ఉంది. మదుమేహాన్ని అంత సులువుగా తగ్గించలేము. దీన్ని నియంత్రణలో ఉంచడానికి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.

READ ALSO : Bitter Gourd : వర్షకాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే కాకరకాయ!

కాకరకాయ రసం మదుమేహానికి మంచి బెషధంగా వనిచేస్తుంది. కాకరకాయల్లో ఉండే “చెరాటిన్‌” అనే వదార్థం రక్తంలో ఉండే గ్లూకోజ్‌ శాతాన్ని తగ్గిన్తుంది. అద్యయనాల ప్రకారం రక్తంలోని చెక్కెర్లను, గ్లూకోజ్‌ను జీవక్రియలో అధికంగా పాల్గొనేలా చేసి గైకోజన్‌ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది. రక్తంలో అధికంగా గ్లూకోజ్‌స్థాయిలు ఉండటాన్ని మదుమేహం అని అంటారు. గైకోజన్‌ కాలేయంలో నిల్వ ఉంచబడి శక్తి విడుదలకు వినియోగించబడుతుంది. అంతేకాకుండా రక్తంలోని కొవ్వు వదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది.

READ ALSO : Kakarakaya : ఆరోగ్యానికి కాకరకాయ…అసలు విషయం తెలిస్తే?..

కాకరలో క్యాటెచిన్, గల్లిక్ యాసిడ్, ఎపికాటెచిన్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి మరియు పొటాషియం, ఫోలేట్, జింక్ ,ఐరన్ వంటి ఖనిజాల భారీ నిల్వలను కలిగి ఉంది. ఆరోగ్యకరమైన కొవ్వులు , ప్రొటీన్లతో నిండిఉంటుంది. కాకరలో మూడు క్రియాశీల పదార్ధాలు ఉన్నాయి. పాలీపెప్టైడ్, వైసిన్ , చరంటి ఇవి యాంటీ-డయాబెటిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇన్సులిన్ వంటి లక్షణాలు , రక్తంలో చక్కెర-తగ్గించే ప్రభావాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది.

READ ALSO : గుండెకు మేలు చేసే కాకరకాయ గింజలు

కాకరలో లభించే లెక్టిన్, శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ సాంద్రతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కణజాలాలపై పనిచేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని ప్రేరేపించడానికి లెక్టిన్ బాధ్యత వహిస్తుంది, దీని అర్థం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం.

READ ALSO : Crow : కాలజ్ఞాని కాకి అరుపులో గొప్ప సందేశం, కాకి జీవితం మానవులకు కూడా ఆదర్శం

అదే క్రమంలో ఖాళీ కడుపుతో కాకరకాయ రసం సేవించరాదు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తక్కువగా ఉన్నవారు, గర్భవతి స్రీలు మరియు పాలు ఇచ్చే స్త్రీలు, చిన్న పిల్లలు నోటిద్వారా బెవధ చికిత్స పొందుతున్న మదుమేహరోగులు కాకర రసాన్ని తీసుకోకపోవటం మంచిది. ఎ.విఆర్‌.డి.సి. ప్రపంచ కూరగాయల కేంద్రం వారు ఇండియా, థైవాన్‌, టాంజానియా దేశాల భాగస్వాములతో కలిసి కాకరకాయతో టైవు-2 మధుమేహంను నియంత్రించేందుకు పరిశోధన చేస్తున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాలద్వారా ఈ సమచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు , సలహాలు పాటించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు