Crow : కాలజ్ఞాని కాకి అరుపులో గొప్ప సందేశం, కాకి జీవితం మానవులకు కూడా ఆదర్శం

కాకి. కావు కావు మంటూ అరిచే పక్షి అంటూ చీదరించుకుంటాం. కానీ అరుపులో గొప్ప గొప్ప సందేశాలున్నాయనే విషయం తెలుసా..?

Crow : కాలజ్ఞాని కాకి అరుపులో గొప్ప సందేశం, కాకి జీవితం మానవులకు కూడా ఆదర్శం

Message in crow scream

Message crow scream : కాకి. కావు కావు మంటూ అరిచే పక్షి అంటూ చీదరించుకుంటాం. కానీ అరుపులో గొప్ప గొప్ప సందేశాలున్నాయనే విషయం తెలుసా..? అంటే తెలియదనే అంటారు చాలామంది. కాకిని “కాలజ్ఞాని” అంటారు. ఎందుకంటే కాకులు పదే పదే అరుస్తుంటే ఎవరో బంధువులు వస్తారు అని అనుకుంటారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కూడా భూమి కంపించే ముందు కాకులు సూచనలిస్తూ ఎగురుతూ వైపరీత్యాలను సూచిస్తాయి.

కావు కావు అంటూ కాకి అరిచే అరుపులో ఎంతో గొప్ప సందేశం ఉందంటారు పండితులు. కాకి అరుపులో ‘నీ బంధాలు,నీకున్న సిరి సంపదలు ఏవీ నీవి కావు’ అని అందరికీ గుర్తు చేసే సందేశం ఉంది. అదే విషయాన్ని తన అరుపుల ద్వారా బోధిస్తుందట కాకి.  వాస్తవాలను గుర్తించాలని తట్టి లేపుతుందట కాకి. కాకికి ఎక్కడయినా ఆహారం కనిపిస్తే ఆ కాకి ఒక్కటే వెళ్లి తినదు. కావు కావు అంటూ అరిచి తనతోటివారిని పిలుస్తుంది. అన్ని కాకులకు సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి. అది కాకి జీవితం నుంచి మనుషలు కూడా నేర్చుకోవాల్సిన గొప్ప గుణం. సుగుణం. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపడతాయి కాకులు.

Bathing : రోజు చేసేదే అయినా .. స్నానాల్లో ఎన్నిరకాలున్నాయో తెలుసా..? స్నానాలకు అర్ధాలు, ఫలితాలు

పరుల కంట పడని కాకుల కలయిక..
ఆడ కాకి మగ కాకి కలవడం (సంతానోత్పత్తికోసం) ఎవరన్నా ఎప్పుడైనా చూశారా..? అంటూ చూడలేదనే చెబుతారు. ఎందుకంటే కాకులకు అంతటి గోప్యత పాటిస్తాయి శారీరక కలయిక విషయంలో. పిచ్చుకలు మిగతా పక్షులను కలయిక సమయంలో చూసి ఉంటాం గానీ కాకులను ఎవ్వరు అటువంటి సమయంలో చూసే అవకాశం అస్సలు ఉండదు. కాకులకు ఉండే నీతి అది. అంతటి విచక్షణ కాకుల సొంతం. పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి.

కాకుల కట్టడి..బంధుప్రీతి నేర్చుకోవాల్సిన గొప్పగుణం..
కాకుల్లో ఉండే మరో గొప్ప గుణం మనుషులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కచ్చితంగా చెప్పాల్సిందే. ఒక కాకి మరణిస్తే కాకులన్ని గుమిగూడి అరుస్తాయి. ఆ అరుపుల్లో తోటి కాకి చనిపోతే బాధ ఉంది. అన్నీ కలిసి గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేస్తాయి. అంతేకాదు కాకి చనిపోయి తరువాత సంతాపం తెలిపి వాటిపని అవి చూసుకోవు. స్నానమాచరించి గూటికి చేరుతాయి. అంతేకాదు సూర్యోదయానికి ముందే మేల్కొని మానవాళిని నిద్రనుంచి లేపే పక్షులు కాకులు. కావు కావుమంటూ అరిస్తే వెలుగొచ్చేసింది అంటూ అన్నదాతలు మంచంమీద నుంచి లేచి కర్ర పట్టుకుని పొలానికి పయనమవుతారు. అలా మనుషులను తట్టిలేపుతుంది కాకి తన అరుపు ద్వారా.

సలక్షణమైన అలవాట్లుగల పక్షి.. సమయపాలన కాకులకే సొంతం..
సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసే పక్షి కూడా కాకి మాత్రమే.అంటే బ్రహ్మముహూర్తంలో లేచి స్నానమాచరించటమే కాదు..సూర్యాస్తమయం సమయానికి గూటికిచేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులకు మాత్రమే ఉంది అంటే ఎటువంటి అతిశయోక్తిలేదు. అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే అని ఎంతమందికి తెలుసు..? సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక అవి స్నానం చేస్తాయట. కాకిలో ఎన్నో గొప్ప గొప్ప గుణాలున్నాయి కాబట్టి కాకిని కాలజ్ఞాని అని అంటారు. ఇంకా చెప్పాలంటే మనుషులు కూడా కాకుల్ని చూసి నేర్చుకోవాల్సింది..చాలా చాలా ఉంది అని అనటంలో ఎటుంటి అతిశయోక్తి లేదు.

బలగం సినిమాలో కాకికి ఇచ్చిన ప్రాధాన్యత..
ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన “బలగం” సినిమాలో “కాకి” ని మన ఆచారంలో భాగంగా చూపించారు. అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే కాకి “కాలజ్ఞాని” అంటారు”..కాకి చనిపోయిన వ్యక్తి వారసులు పెట్టిన పిండం ముట్టకపోతే వారికి విముక్తి లభించదంటారు.చనిపోయినవారి ఆత్మ శాంతించదని అంటారు. కాకి పిండం ముడితేనే వారి ఆత్మ శాంతిస్తుందని..ఆత్మ ఇహలోకం నుంచి పరలోకం చేరుతుందని విశ్వసిస్తారు.