Kakarakaya : ఆరోగ్యానికి కాకరకాయ…అసలు విషయం తెలిస్తే?..

కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు.

Kakarakaya  : ఆరోగ్యానికి కాకరకాయ…అసలు విషయం తెలిస్తే?..

Bitter Gourd

Kakarakaya : కాకర ఇది ఒక తీగజాతి మొక్క..చేదుగా ఉండే కాకర వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. కాకర ఆకులు, రసం, కాయలు అన్ని విధాలుగా మానవ దేహానికి మేలు కలిగించేవే… వీటిలో కూడా అనేక రకాలు ఉన్నాయి. నల్ల కాకర, తెల్ల కాకర, బారామాసి, పొట్టికాకర, బోడ కాకర కాయ, గుండ్రని కాకర అని వివిధ రకాలు ఉన్నాయి. అన్ని రకాలు చేదుగానే ఉంటాయి.

కాకరకాయలను ఉడికించి, పులుసుగా, బెల్లం జత చేసుకుని కూరచేసుకుని తింటారు చాలా మంది. కాకరలో నీరు తక్కువ గా ఉండి పౌష్టికత అధికంగా ఉంటుంది. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ. థయామిన్‌, రెబొఫ్లేవిన్‌, విటమిన్‌ బి6, పాంథోనిక్‌ యాసిడ్‌, ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.

అందుకే కాకరను తరచూ తినమని సూచిస్తుంటారు. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే గర్భీణీ స్త్రీలు దీనిని వాడకపోవటమే మంచిది. చిన్నారులకు కూడా పెట్టకపోవటమే మేలు. ఎందుకంటే ఇందులో వీటి గింజల్లో చిన్నారులకు హానికలిగించే విషపదార్ధం ఉంటుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో బాగా ఉపకరిస్తుంది. కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఎన్నో ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. కాకరగాయ తినడం వల్ల జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరగాయ రసం తాగితే మరింత మంచిది.

రక్త శుద్ధి, కాలినగాయాల పరిష్కారం: రక్తాన్ని శుద్ధి చేయడంలో కాకరగాయ ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, కాలినగాయాలు, పుండ్లను మాన్పడంలో కూడా కాకరగాయ చక్కగా పనిచేస్తుంది. అందమైన శరీరాకృతి కోరుకునే వారు, బరువు తగ్గాలనుకునేవారు చేదుగా ఉన్నా కాకరగాయ రసం తాగాల్సిందే. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయి.

కంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదర సమస్యలకు, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలకు కాకరకాయ రసానికి మించిన సంజీవని లేదు. గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్. శరీరంలో కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచి, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో కాకరకాయ ప్రధాన భూమిక పోషిస్తుంది.

జీర్ణ శక్తిని వృద్ధిచేస్తుంది. ఇందులోని చేదుగుణం వల్ల పొట్టలో ఉండే చెడు కలిగించే పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న మోమొకార్డిసిన్‌ యాంటి వైరస్ గా ఉపయోగపడును.ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల కాన్సర్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంచిది. కాకరాకు రసాన్ని కుక్క కాటుకు విరుగుడుగా వాడతారు.

ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్‌. అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది. శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి. గాయాలకు కాకర ఆకుల రసం తో త్వరగా నయం చేసేందుకు అవకాశం ఉంటుంది. చర్మ సంబంధిత రోగాలకు కాకర రసం ఉపకరిస్తుంది.