విచిత్రం : డాగ్.. ర్యాంప్ వాక్ 

  • Published By: veegamteam ,Published On : January 17, 2019 / 02:36 PM IST
విచిత్రం : డాగ్.. ర్యాంప్ వాక్ 

ముంబై : ముంబైలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్-2018లో ర్యాంప్ వాక్ తళుకుబెళుకుల మధ్య కన్నులపండుగగా సాగింది. డిజైనర్ రోహిత్ బలా ఆధ్వర్యంలో జరిగిన ఈ షోలోనే న్యూ స్టార్ సిద్దార్థ మల్హోత్రా తన బర్త్ డే చేసుకోవడం ఓ విశేషం. ఇక బ్యూటిఫుల్ బామల సందడి ఉండగా షో స్టాఫర్ గా ఓ కుక్క మోడల్స్ వెనకే తిరుగుతూ కనిపించడం మరో విశేషం. మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో ఓ స్ట్రీట్ డాగ్ కూడా ఎంట్రీ ఇచ్చింది.

ఇంతమంది అందగత్తెలు ఒక్కచోట ఎందుకున్నారనుకుందో ఏమో గానీ, కాసేపు అక్కడక్కడే తచ్చాడింది. మోడల్స్ మాత్రం అక్కడ ఏం చేయలేని పరిస్థితి. ఫొటోలకు ఫోజులిస్తూ అలానే అది వెళ్లే వరకు స్టాచ్యూల్లా నిలబడిపోయారు. తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్ లో బాయ్ ఒకరు వచ్చి దాన్ని అదిరించారు. కుక్క వెళ్లిపోయిన తర్వాతే హీరో సిద్ధార్థ మల్హోత్రా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ మోడల్స్ వారిలో వారే నవ్వుకున్నారు.