Burn Belly Fat
Burn Belly Fat : బరువు తగ్గాలని అందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలు చేయడమే కాదు.. వ్యాయామంతో పాటుగాపరగడుపునే కొన్ని డ్రింక్స్ తాగితే చాలు. మంచి ఫలితాలను పొందొచ్చు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివాళ్లు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ జీవితం ఆనందమయవుతుంది.
READ ALSO : Weight Loss : ఆలివ్ ఆయిల్ , నిమ్మరసం బరువు తగ్గడానికి దోహదపడతాయనటంలో వాస్తవాలు & అపోహలు !
గోరువెచ్చని నీరు :
మనం రోజు ఎలా ప్రారంభించామనేది శరీరంపై చాలాప్రభావాన్ని చూపిస్తుంది. ఉదయాన్నే ఒక కప్పు గోరువెచ్చని నీటిని తాగడం కూడా మంచిది. దీనివల్ల జీర్ణక్రియ సులువుగా అవుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉదయం నీటిని తీసుకోవడం వల్ల శరీరం రీ హైడ్రేట్ అవుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం కూడా బ్రేక్ ఫాస్ట్ కి ముందు అధికంగా నీటిని తీసుకోవడం బరువు తగ్గడానికి మంచిమార్గం. ఎందుకంటే ముందుగా నీరు తాగడం వల్లక్యాలరీలను ఎక్కువగా తీసుకోలేం. తద్వారా బరువు పెరిగే ప్రమాదం నుంచి కూడా బయటపడుతాం. అలాగే ఉదయాన్నే నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లి ఆరోగ్యం మెరుగవుతుంది.
READ ALSO : Gym Trainer : 210కిలోల బరువు బ్యాలెన్స్ చేయలేక మెడ విరిగి చనిపోయిన జిమ్ ట్రైనర్
మెంతి నీరు :
గోరువెచ్చని నీటితో పాటు ఏదైనా నీళ్లు తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. గ్లాసు నీటిలో ఒక టీస్పూన్మెంతి గింజలను నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ గింజలను తీసేసి ఆ నీటిని తాగండి. ఆ నీరు శరీరంలో ఉన్న కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.
నిమ్మరసం :
బరువు తగ్గే ఉపాయం చేసే వారు ఎక్కువగా పాటించేది ఇదే! గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. నిమ్మకాయలో సిట్రస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి ఒంట్లోనిటాక్సిన్స్ ని బయటకు పంపేందుకు సహాయపడుతాయి.
READ ALSO : Lose Weight : బరువు తగ్గడానికి కాఫీ ఎలా తాగాలి? బ్లాక్ కాఫీ మంచిదా.. మిల్క్ కాఫీ మంచిదా?
జీలకర్ర నీళ్లు :
మన ఇంట్లో సాధారణంగా దొరికే దినుసుగా జీలకర్రను పరిగణించవచ్చు. జీరా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు.. వేగంగా కొవ్వును తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ జీలకర్రను రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం కాచి, వడకట్టి ఉదయమే తాగితే మంచి ఫలితం ఉంటుంది.
సోంపు :
ఇది న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్లకి పవర్ హౌస్. ఇందులో ఫైబర్స్, మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. సోంపులో ఉండే పోషకాలు బరువు తగ్గేందుకు, ఒంట్లోని కొవ్వును కరిగించడానికి బాగా పనిచేస్తాయి. దీనికోసం సోంపునుపరగడుపునే ఒక టీస్పూన్ అంత వేసుకొని చూడండి. మీ జీర్ణవ్యవస్థ పని తీరు చాలా వరకు మెరుగుపడుతుంది.
READ ALSO : Menopause Snacks : బరువు పెరగకుండా చూసే మెనోపాజ్ స్నాక్స్ !
దాల్చిన చెక్క :
మసాలా దినుసుగా మనకు ఎంతో మేలు చేసేది దాల్చిన చెక్క. భారతీయ వంటకాల్లో ప్రధానంగా కనిపించే మసాలా దినుసు. మన జీర్ణక్రియను మెరుగు పరుచుకునేందుకే ఈ మసాలాను చాలా వంటల్లో మన వాళ్లు చేరుస్తుంటారు. ఇక ఈ దాల్చిన చెక్కను కాస్త పొడి చేసి పెట్టుకోవాలి. చిటికెడు ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరిగడుపునే తాగండి. కచ్చితంగా కొన్ని రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం.