Diabetes : ఆహారం తీసుకోవటంలో చేసే తప్పులు మధుమేహానికి దారితీస్తాయా? ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారంటే?

ఆకలి లేకపోయినా, కడుపు నిండుగా ఉన్నా ప్లేట్‌లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఆకలి, సామర్థ్యం కంటే ఎక్కువ తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు చెబుతున్నారు.

Diabetes : మధుమేహాం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మధుమేహాన్ని నివారించ్చన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అనుకోకుండా చేసే కొన్ని ఆహారపు పొరపాట్లు వల్ల మధుమేహం వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది.

READ ALSO : Sugar Cause Diabetes : షుగర్ ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందా? ఇందులోని వాస్తవమెంత ?

మధుమేహం అనేది శరీరం ఆహారాన్ని ఎలా శక్తిగా మార్చటాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితి. ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయలేనప్పుడు, శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు మధుమేహం వస్తుంది. జీవనశైలిలో సాధారణ మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

మోతాదుకు మించి ఆహారం తినడం, ఆకలి లేకపోయినా తినడం, అతిగా తినడం, విందుల పేరుతో ఇష్టమైన ఆహారం తీసుకోవటం ఇవన్నీ కాలక్రమేణా మధుమేహానికి దారితీస్తాయి. మధుమేహం వచ్చే అవకాశాలను పెంచే ఆహారపు తప్పుల గురించి ఆయుర్వేద నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

READ ALSO : Prevent Diabetes : మధుమేహం ఎలా నివారించాలి ? ప్రారంభ దశలో ఉంటే ఏంచేయాలి ?

1. రోజూ పెరుగు తినడం ; పెరుగు ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ ఆహారంగా చెప్పవచ్చు. దీంతో దానిని రోజువారీ ఆహారంలో తీసుకుంటారు. ఆయుర్వేదం ప్రతిరోజూ పెరుగుని తినమని సిఫారసు చేయదు. రోజూ పెరుగు తినడం వల్ల బరువు పెరగటంతోపాటు, వాపు,జీవక్రియ బలహీనపడుతుందని ఆయుర్వేదనిపుణులు సూచిస్తున్నారు.

2. మోతాదుకు మించి విందు భోజనాలు ; చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా తినడం, జీర్ణవ్యవస్థకు పనితీరుకు ఇబ్బంది కరంగా మారుతుంది. మోతాదుకు మించి విందులలోఆహారం తీసుకోవటం కాలేయంపై ఎక్కువ భారం పడి జీవక్రియను నెమ్మదింపజేస్తుంది. ఇది చివరికి పోషకాహార లోపం , ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Oatmeal : మధుమేహం ఉన్నవారు ఓట్ మీల్ తీసుకోవటం మంచిదేనా ?

3. అతిగా తినడం ; ఆకలి లేకపోయినా, కడుపు నిండుగా ఉన్నా ప్లేట్‌లో ఉన్నవాటిని పూర్తి చేయమని బలవంతం చేసే సందర్భాలు ఉంటాయి. ఆకలి, సామర్థ్యం కంటే ఎక్కువ తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ , జీర్ణ సమస్యలకు దారితీస్తుందని ఆయుర్వేద నిపుణుడు చెబుతున్నారు.

4. ఆకలి లేకుండా తినడం ; శరీరం ఆకలి సంకేతాలను ఇవ్వకుండానే తినడం అలవాటు చేసుకుంటే ఇబ్బందుల్లో పడతారు. దీనివల్ల దీర్ఘకాలికంగా నష్టం జరుగుతుంది. ఆకలి లేకుండా తినడం , ప్రతి గంట లేదా రెండు గంటలకు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి మధుమేహానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.

READ ALSO : Ginger Juice : అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలను తగ్గించే అల్లం రసం!

ప్రీ-డయాబెటిస్ ,మధుమేహాన్ని వీలైనంత దూరంగా ఉంచడానికి ఈ అలవాట్లను మానుకోవటం మంచిది. ముఖ్యంగా వంశపారంపర్యంగా మధుమేహం ఉన్నవారికి ఈ అలవాట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. జీవక్రియ , పోషకాహారం శోషణకు భంగం కలిగిస్తాయి. ప్రేగులలో మంటను పెంచుతాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవన్నీ జీర్ణక్రియ సమస్యలు, ఆహార కోరికలు, కండర ద్రవ్యరాశిని కోల్పోవడం, అలసట, నిద్ర సమస్యలు మొదలైన వాటికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఇది శరీరంలో కఫం పేరుకుపోవడానికి దారితీస్తుంది. చివరికి డయాబెటిక్ లేదా ప్రీ-డయాబెటిక్, అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ సమస్యలకు కారణం అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు