Sleep Peacefully : ఈ అలవాట్లను మార్చుకుంటే రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

చాలా మంది సహజమైన సూర్యరశ్మి తగలకుండా నిత్యం నీడపటునే ఉంటుంటారు. అలాంటి వారిలో నిద్రలేమి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మనం సూర్యరశ్మిని కోల్పోయినప్పుడు, మనం మెలనిన్ యొక్క వినియోగం తగ్గిపోతుంది.

Sleep Peacefully : ఈ అలవాట్లను మార్చుకుంటే రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు!

Changing these habits can help you sleep peacefully at night!

Updated On : January 2, 2023 / 12:37 PM IST

Sleep Peacefully : నిద్ర అనేది మనిషి ఆరోగ్యానికి చాల అవసరం. నిద్రించే సమయంలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి పొదటం వల్ల తరువాత రోజు అవి చురుగ్గా పనిచేస్తాయి. నిద్రలేమి సమస్య వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. శరీరానికి నిద్ర ఎంత అవసరమన్న దానిపై నిపుణులు చెబుతున్న మాటప్రకారం రోజుకు 8 ఎనిమిదిగంటలు నిద్ర అవసరం అవుతుంది.

నిద్ర తక్కువైతే అనేక ఆరోగ్య పరమైన ముప్పులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్రకు అనేక రుగ్మతలను నయం చేసే గుణం కూడా ఉంటుంది. నిద్రలేమికి మనం చేసే తప్పులే ముఖ్యకారణాలు. అలాంటి తప్పులు చేయకుండా ఉండటం వల్ల నిద్రబాగా పట్టే అవకాశం ఉంటుంది. నిద్రకు భంగం కలిగించే అలవాట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. పడుకునే ముందుగా డిజిటల్ స్క్రీన్స్ ముందు గడపొద్దు ; కొంతమంది సెల్ ఫోన్ ఎక్కువగా చూసేవారు, కంప్యూటర్ ముందు ఎక్కువ గడిపే వాళ్ళకు ఎంతకు నిద్ర సరిగా పట్టదు. ఫోన్ నుండి వచ్చే నీలి కాంతి మీ సిర్కాడియన్ రిథమ్‌లను తొలగిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తుంది. ఈ నీలి కాంతి నిద్ర-మేల్కొనే చక్రం యొక్క ప్రధాన నియంత్రణ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని అణిచివేస్తుంది. తగినంత మెలటోనిన్ నిద్రలేమి, చిరాకు, పగటి నిద్రకు కారణమవుతుంది.

2. రాత్రి నిద్రకు ముందు అతిగా తినోద్దు ; పడుకునే ముందు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే గంట కంటే ముందుగా ఆహారం తీసుకోవటం మంచిది. దీని వల్ల కడుపు నిండుగా ఉన్న భావన ఉండదు. ప్రశాంతంగా నిద్రపడుతుంది.

3. అతిగా టీ, కాఫీలు వద్దు : కాఫీ, టీలు అదేపనిగా తాగే వారికి నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది. ఇవి శరీరానికి సైతం హానికలిగిస్తాయి. కాఫీలో ఉండే అధిక మొత్తం కెఫిన్ నిద్ర లేమి సమస్యకు కారణమౌతుంది. నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది.

4. సూర్యరశ్మి తగలకుండా నీడపటున ఉండటం ; చాలా మంది సహజమైన సూర్యరశ్మి తగలకుండా నిత్యం నీడపటునే ఉంటుంటారు. అలాంటి వారిలో నిద్రలేమి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. మనం సూర్యరశ్మిని కోల్పోయినప్పుడు, మనం మెలనిన్ యొక్క వినియోగం తగ్గిపోతుంది. ఇది మెలటోనిన్‌ను తయారు చేస్తుంది, ఇది మనకు నిద్రపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజు కొద్ది సమయం సూర్యకాంతి తగిలేలా చూసుకోవటం మంచిది.

5. ఒత్తిడిని తగ్గించు కోవటం ; అధిక స్థాయి ఒత్తిడి నిద్రను దెబ్బతీస్తుంది. నిద్ర కోల్పోవడం మన శరీరం యొక్క ఒత్తిడి ప్రతిస్పందన వ్యవస్థను ప్రేరేపిస్తుంది, ఇది ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలకు దారితీస్తుంది, కార్టిసాల్, నిద్రకు భంగం కలిగేలా చేస్తుంది.