Tollywood Workers Strike Ends: చర్చలు సఫలం.. రేపటి నుంచి షూటింగ్స్ ప్రారంభం.. సినీ కార్మికులు, నిర్మాతల వివాదానికి ఎండ్ కార్డ్..
18 రోజుల గ్యాప్ తర్వాత శుక్రవారం నుంచి షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.

Tollywood Strike
Tollywood Workers Strike Ends: సినీ నిర్మాతలు, ఫెడరేషన్ నేతల మధ్య చర్చలు సఫలం అయ్యాయి. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జోక్యంతో సినీ కార్మికులు, నిర్మాతల వివాదానికి తెరపడింది. లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో వివాదం ముగిసింది. 18 రోజుల గ్యాప్ తర్వాత శుక్రవారం నుంచి షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. 22.5శాతం వేతనాలు పెంచేందుకు ఇరుపక్షాలు ఒప్పుకున్నాయి అని అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ తెలిపారు.
* రూ.2వేల లోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15శాతం పెంపు
* రెండో ఏడాది 2.5శాతం, మూడో ఏడాది 5శాతం వేనాలు పెంపు
* ఇతర సమస్యల పరిష్కారానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ
* నెల వ్యవధిలో మిగతా సమస్యలు పరిష్కారం అవుతాయని గంగాధర్ తెలిపారు
”ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో లేబర్ కమిషన్ వద్ద నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు సఫలం అయ్యాయి. కార్మికులు మూడేళ్లలో 30శాతం వేతనాలు పెంచాలని అన్నారు. ఫెడరేషన్, నిర్మాతల మధ్య చర్చలు జరిపాం. ఇప్పుడు కమిషన్ వద్దకు వచ్చాం. నిర్మాతల 4 కండీషన్లు వారి ముందు పెట్టాం. కాల్ షీట్ల విషయం, రేషియో గురించి అడిగాం. 9 టు 9 కాల్షీట్లకు కార్మికులు ఒప్పుకున్నారు. వేతనాలు పెంచేందుకు మేం కూడా ఒప్పుకున్నాం” అని దిల్ రాజు తెలిపారు.
Also Read: ‘సూత్ర వాక్యం’ మూవీ రివ్యూ.. మలయాళం మర్డర్ మిస్టరీ తెలుగులో..