Oral Insulin : టైప్-2 మధుమేహానికి ప్రపంచంలోనే మొట్టమొదటి నోటి ఇన్సులిన్‌ను విడుదల చేయనున్న చైనా !

ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ను రోగులకు అందించటం గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఇన్సులిన్ ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం అన్నది సమస్యగా ఉంటుంది. ఈ నేపధ్యంలో నోటి ఇన్సులిన్‌కు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంజెక్షన్‌లతో సంబంధం ఉన్న అసౌకర్యాన్ని నోటి ఇన్సులిన్‌ తగ్గిస్తుంది.

Oral Insulin : టైప్ 2 డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం ఈవ్యాధికి సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది శరీరం ఇన్సులిన్‌ని ఉపయోగించకుండా చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందని చెబుతారు. మధ్య వయస్కులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ రకమైన మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది. దీనిని పెద్దలలో ప్రారంభ మధుమేహం అని పిలుస్తారు.

READ ALSO : Sugar Cause Diabetes : షుగర్ ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందా? ఇందులోని వాస్తవమెంత ?

కానీ టైప్ 2 డయాబెటిస్ పిల్లలు, టీనేజ్‌లను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా చిన్నవయస్సులో ఊబకాయం దీనికి కారణం. ప్రస్తుతం ఓరల్ ఇన్సులిన్ లభ్యతతో ప్రపంచంలోనే మొదటి దేశంగా త్వరలో చైనా అవతరించే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.

ఓరల్ ఇన్సులిన్ యొక్క ఫేజ్ III ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, చైనా యొక్క హెఫీ టియాన్‌హుయ్ బయోటెక్నాలజీ (HTIT) ఆదేశ నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్‌కు మార్కెటింగ్ ఆథరైజేషన్ అప్లికేషన్ (MAA)ని సమర్పించింది. టైప్ 2 మధుమేహం చికిత్స కోసం Oramed యొక్క US-ఆధారిత ORA-D-013-1 ఫేజ్ III ట్రయల్ A1C స్థాయిలను గణనీయంగా తగ్గించింది. ఇది గత రెండు మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిని ప్రతిబింబిస్తుంది. హెఫీ టియాన్‌హుయ్ బయోటెక్నాలజీ (HTIT) అనేది ఇజ్రాయెల్ కంపెనీ ఒరామెడ్ ఫార్మాస్యూటికల్స్ యొక్క వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది.

READ ALSO : tDNA: మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక

ఇప్పటి వరకు సాంప్రదాయ ఇంజెక్షన్ ఇన్సులిన్ మాత్రమే మార్కెట్ లో ఉంది. ఇకపై ఓరల్ ఇన్సులిన్ వస్తే ఇది ఒక నమూనా మార్పుగా చెప్పవచ్చు. అదే క్రమంలో నోటి ఇన్సులిన్‌ల వాణిజ్యీకరణలో చాలా అవకాశాలు, సవాళ్లు ఉంటాయని గ్లోబల్‌డేటాలోని ఫార్మా అనలిస్ట్ ప్రశాంత్ ఖాదయతే ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంజెక్షన్ల ద్వారా ఇన్సులిన్ ను రోగులకు అందించటం గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఇన్సులిన్ ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవటం అన్నది సమస్యగా ఉంటుంది. ఈ నేపధ్యంలో నోటి ఇన్సులిన్‌కు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంజెక్షన్‌లతో సంబంధం ఉన్న అసౌకర్యాన్ని నోటి ఇన్సులిన్‌ తగ్గిస్తుంది. సమర్థత ,భద్రత పరంగా సమానంగా ప్రభావవంతంగా ఉంటుంని చెప్తున్నారు. ముఖ్యంగా, ఫేజ్ III ట్రయల్స్‌లో ప్లేసిబో మాత్రమే ఉన్నందున ఇంజెక్ట్ చేయగల ఇన్సులిన్‌లతో దాని సమర్థత,భద్రతపై వ్యాఖ్యానించడం కష్టం అని ఖదయతే అన్నారు.

READ ALSO :  Oatmeal : మధుమేహం ఉన్నవారు ఓట్ మీల్ తీసుకోవటం మంచిదేనా ?

నవంబర్ 2015లో, చైనా, హాంగ్‌కాంగ్ , మకావులలో ఒరామెడ్ యొక్క ఓరల్ ఇన్సులిన్ ORMD-0801కి HTIT ఇన్-లైసెన్స్ ఇచ్చింది. దీనికి విరుద్ధంగా, దాని భాగస్వామి ఒరామెడ్ జనవరి 2023లో ఫేజ్ III ORA-D-013-1 ట్రయల్ నిరాశాజనక ఫలితాలు రావటంతో ఆ తర్వాత T2Dలో USలో నోటి ఇన్సులిన్ క్లినికల్ ట్రయల్ కార్యకలాపాలను నిలిపివేసింది. తిరిగి జూలై 2006లో, ఫైజర్ ప్రపంచంలోని మొట్టమొదటి ఇన్‌హేల్డ్ ఇన్సులిన్ ఎక్సుబెరాను విడుదల చేసింది.

అయితే కేవలం ఒక సంవత్సరం తర్వాత, అది వాణిజ్యపరంగా విజయవంతం కాకపోవడంతో మార్కెట్ నుండి ఎక్సుబెరాను ఉపసంహరించుకుంది. నోటి ఇన్సులిన్ డెలివరీకి సంబంధించి, మార్కెట్‌లో విజయవంతం కావడానికి HTIT మరియు ఒరామెడ్ సమర్థవంతమైన వాణిజ్య వ్యూహాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO : Diabetes : మధుమేహంతో బాధపడుతున్నవారు గోధమ రొట్టెలకంటే, జొన్న, రాగి రొట్టెలు తినటం మంచిదా?

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ఫేజ్ IIIలో రెండు నోటి ఇన్సులిన్‌లు మాత్రమే ఉన్నాయి. గ్లోబల్‌డేటా ప్రకారం, చైనాలో టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కేసుల సంఖ్య 2022లో 57.4 మిలియన్ల నుండి 2028లో 63.3 మిలియన్లకు 2.21 శాతం CAGR వద్ద పెరుగుతుందని అంచనా వేయబడింది. చైనాలో భారీగా ఉన్న T2D రోగుల జనాభాను పరిగణనలోకి తీసుకుంటే, కొత్త నోటి ఇన్సులిన్ చికిత్సలో, మార్కెట్ యాక్సెస్‌లో మరింత మెరుగ్గా ఉండే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు