Green Mirchi
Green Mirchi : రెగ్యులర్‌గా మనం వండే వంటల్లో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలు వాడతాం. అయితే ఇవి రుచిని అందించడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుండి కాపాడతాయని మీకు తెలుసా?
పచ్చిమిరపలో A,C,B6 విటమిన్లతో పాటు ఇనుము, రాగి, పొటాషియం తక్కువ మొత్తంలో ప్రొటీన్, కార్పోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. పచ్చిమిరపలో క్యాప్సైసిన్ అనే పదార్ధం శ్లేష్మ పొరలపై ప్రభావం చూపిస్తుంది. దీంతో అది సులువుగా బయటకు వచ్చేస్తుంది. సైనస్, జలుబుకి పచ్చిమిరప మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది.
Pepper X : ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చికి గిన్నిస్ రికార్డ్
పచ్చిమిరప రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పచ్చిమిరపలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కోతలు, గాయాలు వంటి వాటిని త్వరగా నయం చేస్తుంది. గుండె జబ్బులు, అల్సర్లు కూడా పచ్చిమిరప తీసుకోవడం వల్ల నయమవుతాయట. రక్తంలో చక్కెర స్ధాయిని కంట్రోల్ చేయడంలో ఇవి సమర్ధవంతంగా పనిచేస్తాయి. డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు స్పైసీ ఫుడ్ తినాలనుకుంటే పచ్చి మిరపకాయతో చేసిన ఫుడ్ తీసుకోవచ్చు.
పచ్చిమిరపలో ఉండే విటమిన్ సి, ఇ శరీరంలో రక్తప్రసరణ పెంచడంలో సహాయపడతాయి. మొటిమల సమస్యలను కూడా నయం చేస్తుంది. కేలరీలు పెరగడం అనారోగ్య హేతువు. ఇందులో అసలు క్యాలరీలు ఉండవు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా సులభంగా తినవచ్చును. బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చాలామందిలో మూడ్ స్వింగ్స్ సమస్య ఉంటుంది. పచ్చిమిరపకాయలు మెదడులోని ఎండార్ఫిన్‌లను బయటకు పంపేందుకు ఉపయోగపడుతుంది. దీని కారణంగా మూడ్ స్వింగ్స్ నుండి బయటపడి సంతోషంగా ఉండగలుగుతారట.
Red Chili : మిరపకాయ కారాన్ని అధిక మోతాదులో తీసుకుంటే దుష్పప్రభావాలు తప్పవా ?
ముఖ్యంగా చలికాలంలో పచ్చిమిరపకాయలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చలికాలంలో ఎర్ర మిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలు తినడం వల్ల యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలు దంతాలు, కళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు నివారించడంలో పచ్చి మిరపకాయలు ఎంతగానో సహాయపడతాయి. సో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న పచ్చి మిరపకాయలను మీరు తినే ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి.