Red Chili : మిరపకాయ కారాన్ని అధిక మోతాదులో తీసుకుంటే దుష్పప్రభావాలు తప్పవా ?

మిరపకాయ కారం అధిక వినియోగం శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. నోటిలో పుండ్లకు దారితీస్తుంది. వాంతిని ప్రేరేపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దద్దుర్లు, చికాకు కలిగిస్తుంది. నోటిలో పుండ్లుకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

Red Chili : మిరపకాయ కారాన్ని అధిక మోతాదులో తీసుకుంటే దుష్పప్రభావాలు తప్పవా ?

red chili

Red Chili : చాలా మంది స్పైసీ ఫుడ్స్‌ను ఆస్వాదిస్తారు. ముఖ్యంగా భారతీయ వంటకాలలో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఎర్ర మిరపకాయను రుచిని పెంచే మసాలాగా వంటకాలలో ఉపయోగిస్తారు. కొందమంది వంటకాలు ఎక్కువ కారంగా ఉండాలని కోరుకుంటుంటారు. అలాంటి వారు కారాన్ని ఎక్కువ మోతాదులో వంటకాలలో వేసుకుంటారు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యంపై కొన్ని ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చిల్లీ పౌడర్ ను ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. ఎర్ర మిరపకాయల కారాన్ని ఎక్కువగా తీసుకునే వారు కొన్ని ఆరోగ్య సమస్యలను చవిచూడాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Vitamin D3 : విటమిన్ D3 ఎలాంటి ప్రయోజనం చేకూరుస్తుంది? విటమిన్ D3 పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు !

వాస్తవానికి ఎండుమిర్చి తినడం వల్ల లాభాలు ఉన్నాయని నిపుణులు సైతం చెబుతున్నారు. కారం తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, జబ్బుల బారిన పడకుండా ఉండటంతోపాటు, చక్కర , గ్లూకోజ్ అదుపులో ఉంటుంటాయట. గుండె ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. దీంతోపాటు ఎండుమిర్చిని తినడం వల్ల కొన్ని రకాల వ్యాధులు దూరం అవుతాయంటారు. మిరపకాయ కారాన్ని ఎక్కువగా తినడం వల్ల గుండెల్లో మంట లేదా జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే దానిని నిర్ణీత మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది.

అధిక మోతాదులో తీసుకోవటం వల్ల కలిగే నష్టాలు ;

1. కడుపులో పుండ్లు ;

మిరప పొడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పుండ్లు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. ఎర్ర మిరపకాయల్లోని అఫ్లాటాక్సిన్, కడుపు పూతల, కాలేయ సిర్రోసిస్, పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారితీసే అవకాశాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Diabetes : మధుమేహ నియంత్రణకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?..

2. జీర్ణ సమస్యలు ;

ఎర్ర మిరపకాయలో క్యాప్సైసిన్ ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, లూజ్ మోషన్స్, గ్యాస్, ఆకలి లేకపోవటం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. కారంగా ఉండే ఆహారాన్ని తీసుకున్న తర్వాత జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తటాన్ని గమనించవచ్చు. ఈ సందర్భంలో కారాన్ని తీసుకోవడం పరిమితం చేయాలి.

3. వికారం, వాంతులు ;

ఎర్ర మిరప కారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలు ఉంటాయి. విరేచనాలు, కడుపు నొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు కలిగిస్తుంది. మిరపకాయలను ఎక్కువగా తిన్న తర్వాత కడుపు మంట నుండి ఉపశమనం పొందటానికి ఐస్ క్రీం, చల్లని పాలను, మజ్జిగ వంటివాటిని తీసుకోవటం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ప్రయత్నించవచ్చు.

READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

4. ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది ;

మిరపకాయల కారాన్ని ఎక్కువగా తింటే హానికరంగా మారుతుంది. ఈ స్పైసీ మసాలాలు శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి. సాధారణంగా ఇది నొప్పి , ఒత్తిడిని అనుభవించినప్పుడు శరీరం విడుదల చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

5. చర్మంపై బొబ్బలు, దద్దుర్లు :

మిరపకాయ కారం అధిక వినియోగం శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. నోటిలో పుండ్లకు దారితీస్తుంది. వాంతిని ప్రేరేపిస్తుంది. కొన్ని సందర్భాల్లో దద్దుర్లు, చికాకు కలిగిస్తుంది. నోటిలో పుండ్లుకు దారితీసే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

6. విపరీతమైన చెమటలు ;

మిరపకాయ కారం తినేవారిలో పెదవులను చెమట పడుతుంటాయి. కళ్ళు, నోరు మంటగా ఉంటుంది. కారం ఎక్కువగా తినడం వల్ల శరీరం చెమట పడుతుంది.

7. పెదవుల మంట ;

నోటిలో, పెదవులపై మండే అనుభూతి మిరపకాయ కారం వల్ల ఎదుర్కోవాల్సి వస్తుంది. కారం వంటి సుగంధ ద్రవ్యాలు అలెర్జీ ప్రతిచర్యకు కారణమవుతాయి. కాబట్టి మిరపకాయలను మితంగా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Prevention of Pests : వరి, పత్తి పంటల్లో పురుగుల నివారణ

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహాన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు, సలహాలు పాటించటం మంచిది.