Pepper X : ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చికి గిన్నిస్ రికార్డ్

ఓ పచ్చిమిరపకాయ తన ఘాటుతో ప్రపంచ రికార్డు సాధించింది. ఆకారంలో కూడా చాలా వెరైటీగా ఉండే మిర్చి ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చిగా రికార్డు కొట్టేసింది.

Pepper X : ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చికి గిన్నిస్ రికార్డ్

Pepper X Guinness World Records

Pepper X Guinness World Records : సాధారణంగా మిర్చి అంటే కారంగానే ఉంటుంది. కానీ కొన్ని మిర్చిలు తింటే చుక్కలు కనిపించేత ఘాటు ఉంటాయి. అటువంటివి తింటే ఇక కళ్లు, ముక్కు, నోటి వెంట సెలయేరును తలపించేలా నీరు కారిపోవాల్సిందే.అత్యంత ఘాటు కలిగిన మిర్చిలు ఎన్నున్నా నాకు సాటిరావు అనేలా ఓ రకం మిరపకాయ ప్రపంచ వ్యాప్తంగా పేరొందింది. అదే ‘పెప్పర్ ఎక్స్’ (Pepper X)మిర్చి. దీని ఘాటుగా ఏకంగా వరల్డ్ రికార్డే వరించింది.

‘పెప్పర్ ఎక్స్’ మిర్చి ఘాటులోనే కాదు దాని ఆకారంలో కూడా చాలా వెరైటీగా ఉంటుంది.ఈ మిర్చి ప్రపంచంలో అత్యంత కారం కలిగిన మిర్చి. వింత ఆకారంలో ఉండే ఈ మిరపను ‘వరల్డ్ హాటెస్ట్ పెప్పర్’గా పేరొందటమే కాదు దాని ఘాటుకు ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వరించింది. ఈ మిర్చి చూడటానికి ఏదో సగం కొరికిపారేసిన మిర్చిలా ఉంటుంది.కానీ దాన్ని నోట్లో పెట్టుకున్నామా ముల్లోకాలు కళ్లముందు కనిపిస్తాయి. దాని ఘాటును తట్టుకోవటం అంత ఈజీ కాదు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత కారం ఘాటు కలిగిన మిర్చిగా పేరొందింది.

AirAsia CEO Tony Fernades : బోర్డు మీటింగులో అమ్మాయితో మసాజ్ చేయించుకున్న ఎయిర్ ఏషియా సీఈవో

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే చాలా రకాల మిర్చిలు ఘాటుకలిగినవి ఉన్నాయి. కానీ వాటన్నింటిని ఈ పెప్పర్ ఎక్స్ వెనక్కి నెట్టిపారేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కరోలినా రీపర్ రకం మిర్చి ఘాటు కలిగిన మిర్చిగా ఉండేది. దాన్ని కూడా తన ఘాటుతో తొక్కేసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.

కరోలినా రీపర్ జాతి మిర్చిలో స్కోవిల్లే హీట్ యూనిట్ (స్కోవిల్లే హీట్ యూనిట్ అంటే మిరపలో ఉండే కారానికి సంబంధించి కొలమానం) 1.64 మిలియన్ యూనిట్లు కాగా..ఈ పెప్పర్ ఎక్స్ 2.69 మిలియన్ స్కోవిల్లే హీట్ యూనిట్లను నమోదు చేసింది. అంటే కరోలినా మించి అన్నట్లుగా పెప్పర్ ఎక్స్ ఘాటు ఉంటుంది.

స్కోవిల్లే హీట్ యూనిట్ ఎన్ని ఎక్కువ యూనిట్లు ఉంటే ఆ మిర్చి అత మంటను, వేడిని పుట్టిస్తుందని అర్థం. అటువంటిదే ఈ పెప్పర్ ఎక్స్ మిర్చి కూడా. ఈ మిర్చి రకాన్ని ఎడ్ కర్రీ అనే వ్యక్తి పదేళ్లకు పైగా కష్టపడి మరీ ఆవిష్కరించారు. దీంతో ఈ మిర్చిపై పేటెంట్ కూడా పొందారు. ఈ పెప్పర్ ఎక్స్ మిర్చి కోసం కర్రీ కుటుంబం అంతా కష్టపడింది. దీని కోసం ఆయన చాలా ప్రయోగాలే చేశారు. అప్పటి వరకు అంత్యం ఘాటుకలిగిన మిర్చిగా ఉన్న కరోలినా మిర్చి కంటే ఘాటు కలిగిన మిర్చిని ఆవిష్కరించేందుకు కర్రీ తన స్నేహితుడు మిచ్ గాన్ నుంచి పంపించిన మిరపకాయలతో కరోలినా రీపర్ ను క్రాస్ బ్రీడ్ చేశారు. అలా అతని ప్రయోగాలు పదేళ్లు సాగాయి. ఈ క్రమంలో ఎంతో శ్రమపడ్డారు. ఎట్టకేలకు కరోలినా మిర్చి కంటే ఘాటు కలిగిన పెప్పర్ ఎక్స్ ను పండించగలిగారు. దీంతో ఆ మిర్చికి సంబంధించి పేటెంట్ పొందారు. అలాగే ఈ మిర్చి విత్తనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు కర్రీ.

ఈ మిర్చి తినటానికి ఎవ్వరు ముందుకు రారు. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి తింటే తిన్న తరువాత దాదాపు నాలుగు గంటలపాటు మంటతో అల్లాడిపోవాల్సిందే. మంటతో నోటిలోంచే కాదు ముక్కు, కళ్ల వెంట జలపాతాలు కారాల్సిందే. విపరీతమైన వేడితో విలవిల్లాడిపోతారు.