అమ్మో.. డిప్రెషన్ : స్మోకింగ్ కంటే టూ డేంజర్

డిప్రెషన్ ఇప్పుడు సమాజంలో అతి పెద్ద సమస్యగా మారిపోయింది. దీర్ఘకాలిక రోగాలు కంటే ప్రమాదంగా..క్యాన్సర్ కంటే భయకంగా తయారయ్యింది. డిప్రెషన్. దీనికి కారణాలు ఇవీ అని చెప్పలేం..కానీ మనిషిని అమాంతంగా కృంగదీసేస్తుంది. లక్ష మందిలో వున్నా మనిషి ఒంటరిని చేసేస్తుంది. దీనికి కారణాలు ఆయా మనిషి యొక్క మానసిక స్థితి..కుటుంబ,సమాజ పరిస్థితులు కారణం కావచ్చు. డిప్రెషన్ అనేది కనిపించకుండా మనిషిపై అనేక విధాలుగా దాడి చేస్తుంది. కానీ డిప్రెషన్ అనేది స్మోకింగ్ కంటే భయకమైనది, ప్రమాదకరమైనది అని పరిశోధనల్లో కూడా వెల్లడయ్యింది.
స్మోకింగ్ కంటే డిప్రెషన్ గుండెకు ప్రమాదకంగా తయారవుతుందని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆందోళన, డిప్రెషన్ గుండెపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనీ..ఊబకాయం, ధూమపానం కంటే ఈ రెండింి వల్లనే గుంబె జబ్బులు..కీళ్ల నొప్పులు వంచి పలు దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ఈ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
డిప్రెషన్ పై పరిశోధనలు చేసిన కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు 45వేల మంది వృద్ధులకు సంబంధిత ఆరోగ్య సమాచారాన్ని సేకరించి పరిశీలించారు. ఈ పరిశోధనలో భాగంగా..16 శాతం మంది అంటే 2225 అధిక ఆందోళన, డిప్రెషన్ కు గురైనవారు కాగా..31 శాతం మంది అంటే దాదాపు 4737 మంది ఊబకాయం, 14 శాతం మంది 2125 మంది ధూమపానం అలవాటు గలవారు వున్నారు. అధిక డిప్రెషన్ గత 16 శాతం మందికి 65 శాతం మేర గుండె ఆరోగ్యంలో తీవ్రమైన తేడాలు వచ్చినట్లుగా గుర్తించారు. వీరిలో 50శాతం మందికి బీపీ, 87 శాతంమందికి కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా వున్నట్లుగా పరిశోధకులు గుర్తించారు. ఇటువంటి ఆరోగ్య సమస్యలే అధిక బరువు వున్నవారిలోను, స్మోకింగ్ చేసేవారిలోను వున్నట్లుగా పరిశోధనల్లో వెల్లడయ్యిందని తెలిపారు. ఇవి కాకుండా డిప్రెషన్ వల్ల తలనొప్పి, కడుపుకు సంబంధించిన వ్యాధులు, నడుము నొప్పి, ఊపిరి సరిగా అందకపోవటం వంటి పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.