డబ్బో రత్నాని క్యాలెండర్ కోసం ఐష్.. కైరా అద్వాణీ హాట్ ఫోజ్‌లు

ఐశ్వర్యారాయ్.. ఓ కూతురికి తల్లి.. 50ఏళ్లకు 4తక్కువ. దాదాపు నడి వయస్సుకు చేరినట్లే కదా. బాలీవుడ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరేం మాయ చేశాడో ఏమో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ కెమెరా కళ్లతో ఐశ్వర్య ఏజ్ తగ్గించేశాడు. ఓ 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి ఐష్ కళ్లనే ఫోకస్ చేస్తూ అద్భుతమైన ఫొటోను క్లిక్‌మనిపించాడు. 2020 డబ్బూ రత్నాని క్యాలెండర్ ఫొటో షూట్ జరిగిందంటూ ఆయనే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేశాడు.
ముదురు వయస్సు భామ.. ఐష్ ఒక్కటే కాదు. విద్యాబాలన్ కూడా మరో సారి ఓల్లాలా.. ఓలాలా అనే రేంజ్‌లో బాత్ డ్రస్‌లో వెయింటింగ్ అనే లుక్‌లో మెరిసిపోతుంది. వీరిద్దరి కంటే హాట్‌గా ఉంది కైరా అద్వాణీ ఫొటో. ఆ ఫోజ్ చూస్తుంటే ఆకు మీద కూడా అసూయపడేలా ఉంది స్టిల్. అంటే చూడగానే సెమీ న్యూడ్ అనిపిస్తుంది కానీ, ఒక ఆకు మాత్రమే అడ్డు ఉంది. అది చాలదా తిట్టుకోవడానికి.
వాళ్లతో పాటు సన్నీలియోన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కృతి సనన్, అనన్యా పాండే.. అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, భూమి పడ్నేకర్ ఫొటోలు చాలదా.. ఈవెనింగ్ అయినా హీట్ పెరిగిపోవడానికి..
బాలీవుడ్ వరకూ అయితే ఓకే.. మరి సౌత్ ఇండియా హీరోయిన్స్‌తో క్యాలెండర్ ఎప్పుడు రెడీ చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు సౌత్ నెటిజన్లు.