Diabetes under control : జీవనశైలి, ఆహారంలో మార్పులతో మధుమేహం అదుపులో!
డయాబెటిస్ ను తగ్గించుకోవాలంటే సరైన ప్రణాళిక ప్రకారం కార్బోహైడ్రేట్లు వినియోగాన్ని తగ్గించి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికోసం ప్రాణాయామ, మెడిటేషన్ వంటి వాటిని చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Diabetes under control with changes in lifestyle and diet!
Diabetes under control : ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, కుటుంబ చరిత్ర టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహాన్ని నియంత్రించాలంటే శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. శరీరం శారీరకంగా చురుగ్గా ఉంటే షుగర్ అదుపులో ఉంటుంది. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మీరు అధిక బరువుతోపాటు మధుమేహాం ఉన్నట్లైతే దానిని అదుపులో ఉంచుకునేందుకు శరీరాన్ని చురుకుగా ఉంచడానికి రోజువారిగా వ్యాయామాలు చేయాలి. తద్వారా బరువు తగ్గాలి.
రోజువారి ఆహారంగా తీసుకునే వాటిలో మొక్కల ఆధారిత ఆహారాలు ఉండేలా చూసుకోండి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో మొక్కల ఆధారిత ఆహారాలు చాలా సహాయకారిగా ఉంటాయి. ఈ ఆహారాలు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించటంతోపాటు రక్తంలో చక్కెరను నియంత్రించడానికితోడ్పడతాయి. అలాంటి ఆహారాలకు సంబంధించి పాలకూర, బచ్చలికూర, ఉసిరికాయ, మెంతులుతోపాటు ఆకు కూరలు, పొట్లకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఉల్లిపాయలు, ఓక్రా, టొమాటో, పుట్టగొడుగు వంటి పిండి లేని కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలైన బ్రోకలీ మొలకలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు లేదా అవిసె గింజలను ఆహారంలో చేర్చుకోండి.
అలాగే డయాబెటిస్ ను తగ్గించుకోవాలంటే సరైన ప్రణాళిక ప్రకారం కార్బోహైడ్రేట్లు వినియోగాన్ని తగ్గించి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికోసం ప్రాణాయామ, మెడిటేషన్ వంటి వాటిని చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా దాన్ని మానేయాలి.
ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కూరగాయలు, ఫైబర్, ప్రోటీన్, మంచి ఫ్యాట్ లను తీసుకోవాలని ఆహార పరిమాణాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. స్వీట్లు తినకపోవటం మేలు.