Peanuts and Jaggery : గుప్పెడు పల్లీలు, చిన్న బెల్లం ముక్కతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల వైరల్, బాక్టీరియల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. ఈ రెండింటిని కలిపి రోజూ తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Did you know the many health benefits of peanuts and a small piece of jaggery?
Peanuts and Jaggery :మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పోషకాలు కలిగి ఉండే ఆహారాలను తీసుకోవాలి. పోషకాలు కలిగిన ఆహారాల్లో పల్లీలు, బెల్లాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. పల్లీలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. సాధారణంగా పల్లీలను చట్నీలలో, కూరల్లో వేస్తాం. అలాగే బెల్లంతో స్వీట్లను తయారు చేస్తాం. కానీ రోజూ వీటిని నేరుగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. భోజనం చేసిన తరువాత గుప్పుడు పల్లీలు, బెల్లం ముక్కను నడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
బెల్లంలో ఉండే ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. పల్లీలు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. రక్తం శుద్ధి జరుగుతుంది. దీంతో ఇన్‌ఫెక్షన్లు, రక్త సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల వైరల్, బాక్టీరియల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. ఈ రెండింటిని కలిపి రోజూ తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. పిల్లలు చదువుల్లో, క్రీడల్లో రోజు వీటిని గుప్పుడు చొప్పునైనా అందించటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. పెద్దలకు సైతం వీటిని తీసుకోవటం వల్ల శక్తి లభిస్తుంది. నీరసం పోయి చురుకుగా ఉంటారు.
పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలను తొలగిస్తాయి. వీటిలోని కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. చలికాలంలో బెల్లం, వేరుశనగ కలిపి తింటే శరీరానికి కావాల్సిన వేడి లభిస్తుంది. గుండెకు మంచి కొవ్వులు లభిస్తాయి. గర్భదారణతో ఉన్నవారు వీటిని తీసుకోవటం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఉపయోగకరంగా ఉంటుంది. కండరాలు బలంగా మారతాయి.