Digestion problems : రాత్రి సమయంలో ఈ ఆహారాలను తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు!
నూనె నెయ్యితో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి లేకపోతే గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు కూడా తినకూడదు.

Digestion problems due to eating these foods at night!
Digestion problems : పర్యావరణ మార్పులు, ఆహారం, జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారం తినడం తప్పనిసరి. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడమే కాదు రాత్రుళ్లు తీసుకునే ఆహారంలోనూ కొన్నింటికి దూరంగా ఉండాలి. మన శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే పోషకాహారాలు తీసుకోవాలి.
ఉదయం ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదన్న విషయంపై అవగాహన కలిగి ఉండటం అవసరం. రాత్రిళ్లు కొన్నిఆహారాలను తినకపోవటమే ఆరోగ్యానికి మంచిది. మరికొన్ని ఆహారాలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. రాత్రిపూట తేలిక పాటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలా అయితేనే మన జీర్ణక్రియ బాగుంటుంది.
రాత్రి సమయంలో తినకూడని ఆహారాలు ;
బిర్యానీ, మసాల ఆహారాలు ; ముఖ్యంగా బిర్యానీ వంటి వాటికి రాత్రిపూట దూరంగా ఉండాలి. చికెన్ ,మటన్ బిర్యానీలను అస్సలు తినకూడదు. ఇది ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. వీటిలో కొవ్వు క్యాలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి . కాబట్టి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అంతేకాదు రాత్రి సమయంలో వీటిని తినడం వల్ల సరిగ్గా జీర్ణం కావు.
బంగాళ దుంపలు : బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని రాత్రుళ్లు తీసుకోకూడదు. శరీరానికి కావాల్సిన శక్తిని తక్కువ సమయంలో అందించే గుణం కలిగిన బంగాళదుంపలను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవడం మంచిది.
వరి అన్నం: వరి అన్నాన్ని రాత్రిపూట తినకూడదు. రాత్రిపూట బదులుగా వరి అన్నం మధ్యాహ్నం తినడం మంచిది. ఇక రాత్రుళ్లు వరి అన్నం బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు తినడం మేలు.
పెరుగు: పెరుగు రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే పెరుగు త్వరగా జీర్ణం కాదు. కేవలం పగటి వేళలో మాత్రమే తినాలి.
మాంసం: మాంసం కూడా త్వరగా జీర్ణం అవ్వదు. మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే దీన్ని మధ్యాహ్నం తినడం మంచిది. రాత్రి సమయంలో తినటం వల్ల అరగక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
స్వీట్లు ; నూనె నెయ్యితో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి లేకపోతే గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు కూడా తినకూడదు. రాత్రిపూట కాఫీ తాగడానికి కూడా నివారించాలి. ఇలా కొన్ని రకాల ఆహార పదార్థాలను రాత్రి సమయంలో తినకపోవడమే మంచిది.
వీటితోపాటుగా చాక్లెట్లు, పుల్లని పండ్ల రసాలు, టమాటా సాస్, పిజ్జా, కాఫీ, టీ లాంటి వాటిని రాత్రుళ్లు తీసుకోకూడదు. ఈ ఆహారాలు తినడం వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అరుగుదల సమస్యలు వస్తాయి.వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.