Digital Strain : కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ గురించి తెలుసా ? పిల్లలు ,పెద్దలలో దీనిని నివారించటం ఎలా ?

పిల్లల కంటి చూపు ఎలా ఉంది,  కంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు తగిన పరీక్షలు చేయించాలి. కంప్యూటర్ గ్లాసెస్ వంటి వాటిని ఉపయోగించటం ద్వారా డిజిటల్ స్క్రీన్‌ వాడే సమయంలో కంటి చూపుపై ప్రభావం పడకుండా చూడటంలో సహాయపడుతుంది.

digital devices

Digital Strain : ప్రస్తుతం సమాజం మొత్తం సాంకేతికంగా పరుగులు పెడుతుంది. దైనందిన జీవితంలో డిజిటల్ పరికరాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అధిక డిజిటల్ ఎక్స్‌పోజర్ కారణంగా ఎదురయ్యే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) కూడా ఒకటి. దీర్ఘకాలం పాటు కంప్యూటర్, ట్యాబ్, మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువగా చూడటం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ కు గురికావాల్సి వస్తుంది. దీనినే మరో వాడుక బాషలో డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఒక ప్రజారోగ్య సమస్యగా మారి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) వ్యాప్తి ;

ఇటీవలి అధ్యయనాల ప్రకారం డిజిటల్ ఐ స్ట్రెయిన్ ప్రభావం వల్ల కండరాలు, కంటి అసౌకర్యంతో అధికశాతం మంది బాధపడుతున్నట్లు వెల్లడించింది. 30% నుండి 90% మంది వరకు ఈతరహా ఇబ్బందులు చవి చూస్తున్నట్లు జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నస్టిక్ రీసెర్చ్ పబ్లికేషన్లో ప్రచురితమైంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ పాఠాల పుణ్యామా అంటు ఈ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ మరింత తీవ్రతరమైనట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

విజువల్ డిస్‌ప్లే టెర్మినల్ VDT వినియోగం పెరగటంతో కంటి సమస్యలు పెరిగాయి. ప్రస్తుత జనాభాలో గణనీయమైన భాగం డిజిటల్ ఐ స్ట్రెయిన్ కు గురవుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. కంప్యూటర్ తో రోజువారిగా పనిచేసే వారిలో డిజిటల్ ఐ స్ట్రెయిన్ ప్రభావం 53.9% వరకు ఉన్నట్లు ఒక అధ్యయనం ప్రకారం వెల్లడైంది.

READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

ఉత్పాదకత, జీవన నాణ్యతపై కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) ప్రభావం ;

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) అనేది అనేక కారణాల వల్ల కలుగుతుంది. ప్రాథమిక కారణం దీర్ఘకాలం, నిరంతరాయంగా డిజిటల్ పరికరాలను ఉపయోగించడం. దీని వల్ల కంటి దురద, చూపు అస్పష్టత , ఏదైనా వస్తువు డబుల్ గా కనబడటం, కంటి నొప్పి, తలనొప్పి, వెన్నునొప్పి వంటి అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది.మెడ , భుజం నొప్పి చేతులు, వేళ్ల తిమ్మిరి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికంగా కంప్యూటర్ వాడకం వల్ల నిద్ర రుగ్మతలకు దారితీయవచ్చు.

చూపులో అసౌకర్యం , అలసట ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, పనులపై దృష్టి పెట్టడం కష్టతరంగా మారుతుంది. పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది. ఈ తరహా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS)కు సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అలాగే మానసిక స్థితిపై ప్రభావం, ఫలితంగా మానసిక శ్రేయస్సు దెబ్బతింటుంది. ఒత్తిడి వల్ల తలనొప్పి, దీర్ఘకాలిక తలనొప్పులకు దారితీస్తుంది. నిద్రలేమి, పెరిగిన ఒత్తిడి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) దారితీస్తుండగా అదే క్రమంలో తలనొప్పికూడా సమస్యలో ఒక బాగంగా మారుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Okra for Diabetes : డయాబెటిక్-ఫ్రెండ్లీ ఆహారంగా బెండకాయ ఎలా తోడ్పడుతుందంటే ?

ఎక్కువ సమయం స్క్రీన్ వాడకం, ముఖ్యంగా నిద్రసమయంలో నిద్రకు భంగం కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్క్రీన్‌ల ద్వారా వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. కంటి అలసట , నిద్రలేమి, వెలుతురు, దృష్టి లోపాలు, కనురెప్పలు ఆర్పకుండా తీక్షణంగా వాటివైపు చూడటం వంటివాటి వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) ప్రమాదాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు ;

డిజిటల్ పరికాలు చూసే సమయాన్ని పరిమితం చేయండి: చిన్నపిల్లల స్క్రీన్ సమయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు గంటలకు పరిమితం చేయాలి.

సరైన సీటింగ్ , లైటింగ్ : పిల్లలు సరిగ్గా కూర్చోవటం, లైటింగ్ అనుకూలంగా ఉందో లేదో చూడటం ముఖ్యం. స్క్రీన్‌ని చూడటానికి మానిటర్ పిల్లల కంటి స్థాయి మధ్య 18 నుండి 28 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. అందుకు తగ్గ కుర్చీని ఏర్పాటు చేసుకోవాలి. పాదాలు నేలకు ఆనేలా చూడాలి. చేతులు సౌకర్యవంతంగా డెస్క్‌పై ఉంచేలా చూడాలి.

READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కంటి చూపు పరీక్షలు : పిల్లల కంటి చూపు ఎలా ఉంది,  కంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు తగిన పరీక్షలు చేయించాలి. కంప్యూటర్ గ్లాసెస్ వంటి వాటిని ఉపయోగించటం ద్వారా డిజిటల్ స్క్రీన్‌ వాడే సమయంలో కంటి చూపుపై ప్రభావం పడకుండా చూడటంలో సహాయపడుతుంది. కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేలు, కళ్లజోడుపై పూతలు వంటివి కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

మధ్యమధ్యలో విరామాలు : ప్రతి 20 నిమిషాలకు, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడటానికి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. అదేసమయంలో మెడ, చేతులు, భుజాలు వెనుక భాగంలో ఒత్తిడిని వదిలించుకోవటానికి అటుఇటు కదలించేలా వ్యాయామాలు చేయాలి.

పెద్దలకు మార్గదర్శకాలు: పెద్దలు సైతం పైన చెప్పిన విధానాలను అనుసరించాలి. కృత్రిమ కన్నీళ్లు, లూబ్రికేటింగ్ కంటి చుక్కలు పొడి కళ్లకు తేమ అందించటానికి, కాస్త ఉపశమనం కలిగించడానికి ఉపయోగించవచ్చు. కళ్లను నలపటం మానుకోవాలి. ఇలా చేయటం వల్ల కంటి ఒత్తిడి మరింత తీవ్రతరం అవుతుంది.

READ ALSO : Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !

అవగాహన తప్పనిసరి : కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ప్రమాదాలు నిరోధించడానికి తగిని అవగాహన, ప్రచార కార్యక్రమాలు అవసరం అవుతాయి. సాధారణ నివారణ చర్యలను అనుసరించడం ద్వారా, పిల్లలు, పెద్దలలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ CVS అభివృద్ధి చెందే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమచారం అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు పొందటం మంచిది.