Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !

నిమ్మకాయ తీసుకుంటే జలుబు చేస్తుందంటారు. కానీ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో నిమ్మలోని విటమిన్ సిదే  మొదటి స్థానమట. తెల్లరక్తకణాల తయారీకి ఇది తోడ్పడుతుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !

Healthy Eating

Healthy Eating : ఇది ఇన్ ఫెక్షన్ల కాలం. అయినా కొందరికి ఏ వైరల్ ఇన్ ఫెక్షన్ అయినా త్వరగా తగ్గిపోతుంది. కొందరిని మాత్రం తీవ్రంగా వేధిస్తుంటుంది. వాళ్ల శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిలో ఉన్న తేడా వల్లనే ఇలా జరుగుతంది. సహజసిద్ధంగానే ఇమ్యూనిటీ బాగుంటుంది. కానీ మనం తినే ఆహారం, స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవడం వంటి ప్రయత్నాల ద్వారా కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

READ ALSO : Amla Juice : శీతాకాలంలో వ్యాధులు దరిచేరకుండా రక్షించే ఉసిరికాయ జ్యూస్!

తొలి అడుగు.. పండ్లు

వర్షం పడుతుంటే.. సాయంకాలం… పునుగులు, మిర్చీబజ్జీల వంటి నూనెలో వేయించిన పదార్థాల మీదకి మనసు పోతుంది. లేదా ఏ వేడి వేడిసమోసానోతినాలనిపిస్తుంది. కొందరు సింపుల్ గా హాట్ టీ తో పాటుగా బిస్కెట్లు తింటారు. కానీ ఇలాంటి ఫుడ్ బదులుగా సాయంకాలం హాయిగా పండ్లు తింటే ఇన్ ఫెక్షన్లను నివారించడానికి ఒక స్టెప్ ముందుకు వేసినట్టే. జలుబు, దగ్గు లాంటి ఫ్లూ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారమే కీలకం అవుతుంది. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటే వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తివంతమై ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ ఫలాలను తీసుకోండి. ఇవి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. వ్యాధి నిరోధక శక్తిని మెరుగ్గా ఉంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచే అలాంటి ఆహారం ప్రతిరోజూ తీసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు రావాలంటే వెరైటీ పదార్థాలను తినాలి.

READ ALSO : Mangosteen Fruit : పోషకాలతో నిండిన ఉన్న మాంగోస్టీన్ పండు! ఈ పండు తింటే దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవు తెలుసా?

జలుబు కాదు… పెరిగేది ఇమ్యూనిటీ

నిమ్మకాయ తీసుకుంటే జలుబు చేస్తుందంటారు. కానీ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో నిమ్మలోని విటమిన్ సిదే  మొదటి స్థానమట. తెల్లరక్తకణాల తయారీకి ఇది తోడ్పడుతుంది. తద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మ మాత్రమే కాదు సిట్రస్ పదార్థాలైన నారింజ, ఉసిరి కూడా మంచివే. బొప్పాయి పండులో కూడా విటమిన్ సి ఉంటుంది. ప్రతిరోజూ ఏదో రూపంలో విటమిన్ సి ని తీసుకోండి.జలుబు లాంటి చిన్న చిన్న ఇన్ ఫెక్షన్లు రావొద్దంటేసిట్రస్ ఫలాలు తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆకు కూరలలాంటి కూరగాయల్లో కూడా ఇమ్యూనిటీ పెంచే విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

READ ALSO : Chandrababu Naidu : 4 నెలల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే- చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇమ్యూనిటీ పెంచే విటమిన్ కోసం..

సిట్రస్ ఫలాల్లో కన్నా ఎక్కువ విటమిన్ సి పండుమిరపలో ఉంటుంది. వీటిలో బీటా కెరొటిన్ కూడా ఉంటుంది. బ్రాకోలి, బచ్చలి కూర లాంటి కూరగాయల్లో కూడా విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎ, సి, ఇ విటమిన్లు కూడా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి కూడా ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. జలుబు, జ్వరం ఉన్నప్పుడు సూప్ తాగితే నోటికి బావుంటుంది. చికెన్ సూప్ తాగితే ప్రొటీన్లు కూడా అంది బి విటమిన్లు కూడా లభిస్తాయి. అందుకే ఇకనుంచీవీలైనంత ఎక్కువగా ఇలాంటి ఆహారం తీసుకునే ప్రయత్నం చేయండి.. ఇన్ ఫెక్షన్లకు దూరంగా ఉండండి.