Okra for Diabetes : డయాబెటిక్-ఫ్రెండ్లీ ఆహారంగా బెండకాయ ఎలా తోడ్పడుతుందంటే ?

రక్తంలో చక్కెర స్థాయిలపై బెండకాయ ప్రభావం చూపుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో చక్కెర శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నిర్వహణకు మంచి ఆహారమని చెప్పవచ్చు.

Okra for Diabetes : డయాబెటిక్-ఫ్రెండ్లీ ఆహారంగా బెండకాయ ఎలా తోడ్పడుతుందంటే ?

blood sugar levels

Okra for Diabetes : బెండకాయ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కూరగాయలలో ఒకటి. దీని ప్రత్యేక రుచి , అనేక ఆరోగ్య ప్రయోజనాల వల్ల దీనిని ఆహారంగా తీసుకుంటున్నారు. డయాబెటిక్ ఫ్రెండ్లీ వంటకాలలో బెండకాయ కూడా ఒకటి. ఆరోగ్యానికి మేలుచేసే భోజనాన్ని రూపొందించడానికి ఒక ఖచ్చితమైన కూరగాయగా బెండకాయ తోడ్పడుతుంది.

READ ALSO : Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుకు నిసనగా ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ, ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో భారీగా పోలీసులు మోహరింపు

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బెండకాయ యొక్క ప్రయోజనాలు

భారతదేశంలో లేడీస్ ఫింగర్ అని కూడా పిలువబడే బెండకాయ ఆరోగ్యకరమైన ఆహారంగా పేరు పొందింది. విటమిన్ ఎ మరియు సి సమృద్ధిగా, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో కూడా నిండి ఉంటుంది.

READ ALSO : Madhapur : క్షణాల్లో పేక మేడల్లా రెండు భారీ భవనాలు కూల్చివేత

రక్తంలో చక్కెర స్థాయిలపై బెండకాయ ప్రభావం చూపుతుంది. అధిక ఫైబర్ కంటెంట్ శరీరంలో చక్కెర శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నిర్వహణకు మంచి ఆహారమని చెప్పవచ్చు. మధుమేహాన్ని నిర్వహించడంలో కీలకమైన అంశంగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Telangana : తోపుడు బండిపై మద్యం అమ్మకాలు .. ఎగబడి కొనేస్తున్న మందుబాబులు

తక్కువ కేలరీలతో, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) కలిగి సూపర్ ఫుడ్ గా బెండకాయను చెప్పవచ్చు. జీర్ణ క్రియలకు సహాయపడంతోపాటు, మలబద్దకం వంటి సమస్యలతో పోరాడటంలో, అజీర్ణం వంటి కడుపు సంబంధ సమస్యలు తలెత్తకుండా చూడటంలో ఉపకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, బీపి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గించటంలో, హార్మోనుల హెచ్చుతగ్గులను నిర్వహించడంలో సహాయపడతాయి.

READ ALSO : ఇంట్లోనే మీ ఐఫోన్ సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చు..!

బెండకాయలో విటమిన్ కె, ఎముకలు పెరుగుదలకు , రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు బెండకాయల్లో ఉండే విటమిన్ ఎ, బి, సిలు గర్భస్థ మధుమేహ సమస్యలు తలెత్తకుండా, రక్తంలోని చక్కర స్థాయిలను నిర్వహించడంలో ఉపకరిస్తాయి.