High Blood Pressure : అధిక రక్తపోటు పునరుత్పత్తి పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా ?

మగ , ఆడ పునరుత్పత్తి కణజాల వాస్కులేచర్ , హార్మోన్ స్థాయిలు రెండూ హైపర్‌టెన్షన్‌తో ప్రభావితమవుతాయి. పురుషులలో హైపర్‌టెన్షన్ కారణంగా అంగస్తంభన, వీర్యం పరిమాణంలో తగ్గుదల, స్పెర్మ్ కౌంట్ , చలనశీలత, వంటివి చోటు చేసుకుంటాయి.

high blood pressure

High Blood Pressure : అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. అయితే రక్తపోటు గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుందన్న విషయం సాధారణంగా అందరికి తెలిసిందే. అయితే ఇది పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పునరుత్పత్తి ఆరోగ్యంపై రక్తపోటు హానికరమైన ప్రభావాలను గుర్తించటం చాలా కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : High Blood Pressure : మధుమేహం అధిక రక్తపోటుకు కారణమవుతుందా ? నివారణకు సులభమైన చిట్కాలు !

హైపర్‌టెన్షన్ స్త్రీ , పురుషుల సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది. పురుషులలో, అధిక రక్తపోటు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేయడం ద్వారా అంగస్తంభనకు దారితీస్తుంది. జననేంద్రియ ప్రాంతంలో ఇది స్పెర్మ్ కౌంట్ తోపాటు దాని చలనశీలతలో తగ్గుదలకి కారణమవుతుంది. ఫలితంగా సంతానోత్పత్తి తగ్గుతుంది. ఆడవారిలో, అధిక రక్తపోటు పునరుత్పత్తి వ్యవస్థ సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. క్రమరహిత పీరియడ్స్ కు , సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు, ప్రీఎక్లంప్సియా, గర్భధారణ మధుమేహం అకాల పుట్టుక వంటి వాటికి దారితీస్తాయి.

READ ALSO : అధిక రక్తపోటు సమస్యా? నిర్లక్ష్యం వద్దు!

గర్భిణీ స్త్రీకి అధిక రక్తపోటు కంట్రోల్ చేయలేని పరిస్ధితిలో ఉన్నప్పుడు మాయకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. ఫలితంగా కడుపులో అభివృద్ధి చెందుతున్న శిశువుకు ఆక్సిజన్ ,పోషకాలు సరిపోవు. ఎదుగుదల పరిమితమై, తక్కువ బరువుతో శిశువులు పుడతారు. అంతేకాకుండా, అధిక రక్తపోటు లైంగిక సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. పురుషులు, స్త్రీలలో లిబిడోను తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో సంబంధం ఉన్న దీర్ఘకాలిక ఒత్తిడి , అలసట లైంగిక కోరిక , పనితీరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

READ ALSO : Curry Juice : రక్తపోటును తగ్గించటంతోపాటు, పొట్ట కొవ్వులను కరిగించే కరివేపాకు జ్యూస్ !

మగ , ఆడ పునరుత్పత్తి కణజాల వాస్కులేచర్ , హార్మోన్ స్థాయిలు రెండూ హైపర్‌టెన్షన్‌తో ప్రభావితమవుతాయి. పురుషులలో హైపర్‌టెన్షన్ కారణంగా అంగస్తంభన, వీర్యం పరిమాణంలో తగ్గుదల, స్పెర్మ్ కౌంట్ , చలనశీలత, వంటివి చోటు చేసుకుంటాయి. అయితే మహిళల్లో, హైపర్‌టెన్షన్ తక్కువ నాణ్యత గల గుడ్డు ఫలదీకరణం వల్ల పిండం గర్భాశయంలో పిండం సరిగ్గా అభివృద్ధి చెందకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది గర్భస్రావానికి దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : Stroke Risk : పక్షవాతం ముప్పుకు అధిక బరువు, రక్తపోటు అతిపెద్ద కారణాలా ?

గర్భధారణ సమయంలో రక్తపోటు విషయానికి వస్తే , కొంతమంది స్త్రీలు గర్భం ధరించటానికి ముందే రక్తపోటును కలిగి ఉంటారు. కొంతమంది స్త్రీలు గర్భధారణ సమయంలో రక్తపోటును కలిగి ఉంటారు. దీనిని గర్భధారణ రక్తపోటు అని కూడా పిలుస్తారు, దీనిని ప్రీఎక్లాంప్సియా అని కూడా పిలుస్తారు. గర్భధారణ సమయంలో రక్తపోటుకు సంబంధించిన సమస్యలు,  ప్రసూతి ఆసుపత్రిలో చేరేవారిలో దాదాపు 25%. రక్తపోటును ముందస్తుగా రోగ నిర్ధారణ చేయడం ద్వారా , తగిన చికిత్స పొందవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జీవనశైలి మార్పులతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఉప్పు తక్కువ తీసుకోవడం వంటి జాగ్రత్త చర్యలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు