Detect Adulteration : కూరగాయలు, పండ్లలో కల్తీని గుర్తించటం ఎలాగో తెలుసా ?

పుచ్చకాయ, అపిల్‌, బత్తాయి పళ్ళలోకి రంగులను లేదా తీపి పదార్థాలను ఇంజెక్షన్‌ ద్వారా లోపలికి ఎక్కించి కల్తీ చేస్తారు. ఈ విధమైన కల్తీని గుర్తించడానికి మొదట కాయను పొటాషియం పర్మాంగనేట్‌ లేదా వెనిగర్‌ లేదా ఇతర ద్రావణాలతోను బాగా రుద్ది కడగాలి.

Detect Adulteration

Detect Adulteration : మనలో చాలా మందికి మనం ఎలాంటి ఆహార వదార్థాలను తింటున్నామో సరిగ్గా తెలియదు. మనం తినే ఆహార వదార్థాలలో రసాయన పదార్థాలు, రంగులు, కలిపి ఉండవచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి కలుషితమైన ఆహార వదార్థాలు కలిగిన కూరగాయలు, పళ్ళను తినడం ద్వారా ఆరోగ్యానికి బదులుగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. సాధారణంగా కూరగాయలు,పళ్ళు ఎండవేడికి పాడవుతుంటాయి. కూరగాయలు అధిక ఉష్ణోగ్రతలకు తొందరగా వాడిపోయినట్లు కనబడకుండా చూడగానే అకువచ్చగా, ఆకర్షణీయంగా, తాజాగా కనపబడానికి వాటిని వివిధ రంగులలో ముంచి తీస్తారు.

READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కూరగాయల్లో ముఖ్యంగా అకుపచ్చ రంగులో ఉండే కాకర, బెండ, పాలకూర, బటాణి మొదలైన వాటిని లక్ష్యంగా చేసుకొని కల్తీ చేస్తున్నారు. కూరగాయలు తాజాగా కనిపించడానికి మలాసైట్‌ గ్రీన్‌ అనే అకువచ్చని రసాయనంలో, వివిధ పురుగు మందుల్లో, ఇతర రసాయనాల్లో ముంచి తీస్తారు. చివరగా వీటిపై మైనపు పూతను పూస్తారు. ఇలాంటి చర్యలు అన్ని కూడా కూరగాయలు తాజాగాకనబడడానికి దోహదం చేస్తాయి.

పళ్ళను మగ్గపెట్టడానికి ముఖ్యంగా కాల్షియం కార్సైడ్‌ అనే రసాయన పదార్ధాన్ని వినియోగిస్తున్నారు. ఇదే కాలియం కార్సైడ్‌ను గ్యాస్‌ వెల్దింగ్‌ ద్వారా ఇనుప పరికరాలను అతికించడానికి, చవకగా లభించే టపాసుల తయారీకి వినియోగిస్తారు. కాలియం కార్సైడ్లో ఆర్సెనిక్‌, ఫాస్పరస్‌ అవశేషాలు ఉన్నాయి. ఇవి ఎసిటిలీన్‌ వాయువును విడుదల చేసి పళ్ళను త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతాయి. మన దేశంలో ముఖ్యంగా అరటి వళ్ళను మగ్గపెట్టడానికి రసాయనాలను వినియోగిస్తున్నారు. వీటిని తినడం ఆరోగ్యానికి చాలా హానికరం. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి పళ్ళను తినిపించరాదు.

READ ALSO : Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !

నిరంతరం రసాయనాలు పూసిన, కృత్రిమంగా మగ్గబెట్టిన కూరగాయలను, వళ్ళను తినడం ద్వారా నోటిలో అల్సర్లు, ఉదర సంబంధ సమస్యలు, అతిసారవ్యాధి, చర్మం మీద దదుర్లు వస్తాయి. రసాయనాలలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ వలన యుక్త వయస్సులో వృద్దాప్య ఛాయలు వస్తాయి. క్యాన్సర్‌, వృాదయ సంబంధ వ్యాధులు, గుండెనొప్పి, కీళ్ళనొప్పి, అలర్జీలు వస్తాయి. ఒకవేళ గర్భంతో ఉన్న స్రీలు కృతిమంగా మగ్గబెట్టిన పళ్ళను తింటే గర్భస్రావం,పెరుగుదల లోపించిన శిశువు జన్మించడానికి అవకాశం ఉంది.

కల్తీ కూరగాయలు, పళ్ళ కల్తీని గుర్తించడానికి ఉవయోగించే సాధారణ వధ్ధతులు 

పచ్చిమిరవ, ఆకువచ్చని కూరగాయలలో కల్తీని గుర్తించడం :

కూరగాయలలో అకుపచ్చ రంగును, తాజాగా కనిపించడానికి వాటికి మలాసైట్‌ గ్రిన్‌ అనే ఆకుపచ్చని రసాయన ద్రావణంలో ముంచి తీస్తారు. దీనిని ఇలా ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ రసాయనాన్ని గుర్తించడానికి కొంత దూదిని తీసుకొని పారాఫిన్‌ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టి కూరగాయల ఉపరితలంపై రుద్దాలి. ఒకవేళ దూది అకుపచ్చ రంగుకు మారితే ఆ కూరగాయ మలాసైట్‌ గ్రీన్‌ రసాయనంతో కల్తీ చేయబడినదిగా గుర్తించాలి.

పచ్చిబఠాణి :

గుప్పెడు బరాణి గింజలను తీసుకొని ఒక గ్లాసులో వేని నీరుపోసి బాగా కలపాలి. ఒక అరగంట సేపు అలాగే కదపకుండా ఉంచితే బరాణి రంగు నీటిలో కలిసిపోతుంది.

చిలగదడదు౦వ :

చిలగడదుంప మంచి రంగులో కనవడడానికి తాజాగా ఉంచడానికి రోడోమైన్‌ – బి అనే రంగుతో కల్తీ చేస్తారు. దీనిని గుర్తించడానికి కొద్దిగా దూదిని తీసుకొని పారఫిన్‌ ద్రావణంలో నానబెట్టి చిలగడదుంప ఉపరితలంపై రుద్దాలి. దూది ఎరువు రంగులోకి మారితే ఆ చిలగడదుంప కల్తీ చేయబడినదిగా గుర్తించాలి.

READ ALSO : Daily salt intake : ఆహారంలో ఉప్పు వినియోగం అధికమైతే అనర్ధాలు తప్పవా ?

పుచ్చకాయ, ఆనక బత్తాయి, ఇతర పళ్ళలో కల్తీని గుర్తించడం :

పుచ్చకాయ, అపిల్‌, బత్తాయి పళ్ళలోకి రంగులను లేదా తీపి పదార్థాలను ఇంజెక్షన్‌ ద్వారా లోపలికి ఎక్కించి కల్తీ చేస్తారు. ఈ విధమైన కల్తీని గుర్తించడానికి మొదట కాయను పొటాషియం పర్మాంగనేట్‌ లేదా వెనిగర్‌ లేదా ఇతర ద్రావణాలతోను బాగా రుద్ది కడగాలి. తరువాత అ కాయను అలాగే రెండు రోజులు ఉంచాలి. కాయలోపలికి ఏమైన కృత్రిమ రసాయనాలు ఎక్కించినట్లయితే అది పులిసిపోయి వాసన వస్తుంది. రంధ్రాల నుండి నురుగుతో కూడిన నీరు కారుతుంది.

అరటిలో కల్తీని గుర్తించడం :

సహజంగా అరటి పండ్లు ముదురు పసుపు వర్ణంలో ఉండి చిన్న చిన్న గోధుమ, నలుపు మచ్చలు ఉంటాయి. కాడలు నలుపు రంగులో ఉంటాయి. కాల్షియం కార్బైడ్ తో కృత్రిమంగా పండిన పండ్లు నిమ్మపసుపు రంగులో ఉండి కాడలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయమొత్తం పసుపు వర్ణంలో ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుంది. రుచి సరిగ్గా ఉండదు. తక్కువ రోజులు నిలువ ఉంటాయి.

READ ALSO : Monsoon Diet : వర్షకాలంలో ఆహారంలో నెయ్యిని తప్పనిసరిగా చేర్చుకోవడానికి 5 కారణాలు !

మామిడిలో కల్తీని గుర్తించటం ;

మామిడి పండ్లు మంచివా, కల్తీవా అని తెలుసుకోవటానికి వాటిని ఒక బకెట్ లో నీటిలో వేసి ఉంచాలి. నీటిలో మామిడి పండ్లు మునిగితే పండ్లు సహజంగా పండినవిగా గుర్తించాలి. నీటిలో తేలితే కృత్రిమంగా మగ్గబెట్టినవిగా గుర్తించాలి.

ఇదే తరహాలోనే ఇతర ఆహారలను సైతం కల్తీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఆనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి మార్కెట్లో కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసే సందర్భంలో తగిని జాగ్రత్తలు పాటించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు