Rose Water : రోజ్ వాటర్ తో చర్మానికే కాదు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందుతాయి తెలుసా?
కంటిశుక్లం సమస్యతో బాధపడుతున్న వారు రోజ్ వాటర్ ని, నిమ్మరసాన్ని 3:1 నిష్పత్తిలో తీసుకొని రెండు కళ్లలోనూ చుక్కలమందుగా వేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. కళ్లు తిరగటం, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు ఒకటేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి తీసుకోవాలి.

Do you know the many health benefits of rose water, not just for the skin?
Rose Water : గులాబీ పూల రెక్కలతో తయారయ్యే రోజ్ వాటర్ వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. గులాబీ రేకులతో అనేక గృహచికిత్సలు చేయవచ్చు. ఆయుర్వేద వైద్యంలో సైతం గులాబీ వాటర్ ను ఉపయోగిస్తారు. గులాబీ పువ్వులలో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఎలిమెంట్ చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంతో పాటు, ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది.
గులాబీ ఆకులను తీసుకోవడం వల్ల చర్మపు మచ్చలు, కాలానుగుణ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలను తొలగించుకోవచ్చు. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఆరు టీస్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీస్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించుకోవాలి. తరువాత వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనతనుంచి బయటపడవచ్చు.
అప్పుడప్పుడు గుండెలో నొప్పిగా అనిపిస్తుంటే ఒక టీస్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీస్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయ, సాయంకాలం మర్దన చేసుకోవాలి. గుండెనొప్పి తగ్గుతుంది. ఆందోళన, వికారాలు తగ్గాలంటే రెండు టేబుల్ స్పూన్ల గులాబీ పూరేకులను ఒక గ్లాసు నీళ్లలో కలిపి కషాయంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన కషాయాన్ని తీసుకుంటే ఆందోళన , ఒత్తిడి దూరమౌతుంది.
కళ్లలో మంటలతో బాధపడుతున్న వారు రోజ్ వాటర్ ని, ఉల్లిపాయలరసాన్ని ఒక్కో టీస్పూన్ చొప్పున కలిపి, పరిశుభ్రమైన దూదితో తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుని అంతే కొంత సమయం ఉచితే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి. కాలిన గాయాలు, దెబ్బలు రోజ్ వాటర్ని, ఉల్లిపాయల రసాన్ని కలిపి గాయాలమీద రాస్తే త్వరితగతిన
మానిపోతాయి.
కంటిశుక్లం సమస్యతో బాధపడుతున్న వారు రోజ్ వాటర్ ని, నిమ్మరసాన్ని 3:1 నిష్పత్తిలో తీసుకొని రెండు కళ్లలోనూ చుక్కలమందుగా వేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. కళ్లు తిరగటం, తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారు ఒకటేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి తీసుకోవాలి. ఇలా చేస్తే తలతిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
కంటినుంచి నీళ్లు కారటం వంటి సమస్యతో బాధపడుతుంటే రెండు టీస్పూన్ల రోజ్ వాటర్లో చిటికెడు పటిక పొడిని కలిపి దూది వుండను ముంచి కళ్లలో డ్రాప్స్ గా చేసుకుంటే ఆ కళ్లనుంచి నీళ్లు కారటం, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే తగ్గుతుంది. జ్వరంతో బాధపడుతుంటే రోజ్ వాటర్, వెనిగర్ ను సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లలో కలిపి, నూలు గుడ్డను తడిపి, మడతలు పెట్టి నుదిటిమీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం తగ్గుతుంది.