Bird Flu : ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిలో అధికంగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో ఈ వైరస్ మనుషులకు మరింత సులభంగా సోకుతుందని UN ఏజెన్సీలు హెచ్చరించాయి. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. అనగా కోళ్ళలో ఈ వ్యాధి అధికంగా వస్తుంది. అయితే, చికెన్ తీసుకోవడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందా అనే ఆందోళన ఇటీవలి కాలంలో ప్రజల్లో నెలకొంది.
READ ALSO : Diabetic Nephropathy : డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవటం ఎలాగంటే ?
చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందా?
బర్డ్ ఫ్లూ సోకిన పక్షులతో లేదా వాటి రెట్టలతో నేరుగా సంబంధం వల్ల ఇది వ్యాపిస్తుంది. వాటి మాంసం వినియోగం ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం స్వల్పంగా ఉంటుంది. అయితే మాంసాన్ని తక్కువ సమయం ఉడికిస్తే ఈ ప్రమాదం ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కవ సమయం ఉడికించిన చికెన్ తినటం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 165°F (74°C) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చికెన్ లేదా ఏదైనా పౌల్ట్రీ మాంసాన్ని ఉడికించటం వల్ల బర్డ్ ఫ్లూ కలిగించే వైరస్‌ను సమర్థవంతంగా చంపి, సురక్షితంగా తినవచ్చు.
READ ALSO : Prevent Heart Attack : గుండెపోటును నివారించాలంటే ముందుగా ప్రమాద కారకాలను తెలుసుకోండి !
చికెన్ వినియోగానికి సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాప్తికి ఉదాహరణలు ;
1997 హాంకాంగ్ లో H5N1 బర్డ్ ఫ్లూ జాతి సోకిన కోడి మాంసం ద్వారా మనుషులకు ఇది వ్యాపించింది, ఫలితంగా ఆరుగురు మరణించారు. 2004 వియత్నాంలో H5N1 జాతి కోడి మాంసం మనుషుల్లో అంటువ్యాధులకు కారణమైంది. ఎక్కువ మంది జబ్బుపడిన, చనిపోయిన పక్షుల మాంసాన్ని తినటం కారణంగా ఈ వ్యాధి వచ్చినట్లు తేలింది. 2013 చైనా లో బర్డ్ ఫ్లూ యొక్క H7N9 జాతి కోడి మాంస వల్ల వ్యాధి సోకింది.
READ ALSO : Overweight : అధిక బరువుకు ప్రధాన కారణలు ఇవే! అవగాహనతో ఊబకాయం నుండి బయటపడొచ్చంటున్న నిపుణులు
బర్డ్ ఫ్లూ ప్రమాదాన్ని తగ్గించడానికి జాగ్రత్తలు ;
చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చికెన్‌ని బాగా ఉడికించాలి: వైరస్‌లను చంపడానికి చికెన్‌ని 165°F (74°C) అంతర్గత ఉష్ణోగ్రత వద్ద ఉడికించుకుని తినటం మంచిది.
READ ALSO : Banana Chips : రుచిగా ఉన్నాయని అరటికాయ చిప్స్ లాగించేస్తున్నారా? ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ఛాన్స్!
కాలుష్యాన్ని నివారించండి: ఇతర ఆహారాల నుండి ముడి చికెన్‌ను వేరు చేయడంతోపాటు మాంసం కట్టింగ్ బోర్డ్‌లు, పాత్రలను ఉపయోగించడం ద్వారా బ్యాక్టీరియా లేదా వైరస్‌ల వ్యాప్తిని నిరోధించండి.
మంచి పరిశుభ్రతను పాటించండి: పచ్చి చికెన్ , దానితో సంబంధం ఉన్న ఏవైనా వస్తువులను పట్టుకున్న తర్వాత చేతులు బాగా కడగాలి. ఈ వ్యాధి వ్యాప్తి ఉన్న సమయంలో కొంతకాలం చికెన్ తినకుండా ఉండటం మంచిది.
READ ALSO : Chewing Gum : బరువు తగ్గడానికి చూయింగ్ గమ్ ! ఇది ముఖం కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందా?
చివరగా చికెన్ తినడం ద్వారా మనుషులకు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందనే ఆందోళన సహజమే అయినప్పటికీ ప్రమాదం చాలా తక్కువనే చెప్పాలి. కోడి మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద బాగా ఉడికించటం , మంచి పరిశుభ్రతను పాటించడం ద్వారా, బర్డ్ ఫ్లూ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.