Overweight : అధిక బరువుకు ప్రధాన కారణలు ఇవే! అవగాహనతో ఊబకాయం నుండి బయటపడొచ్చంటున్న నిపుణులు
బరువు తగ్గాలంటే కొవ్వులకు దూరంగా ఉండాలని చాలా మంది బావిస్తుంటారు. అయితే శరీరానికి శక్తి వచ్చేది కొవ్వు పదార్థాలన్న విషయం చాలా మందికి తెలియదు. రోజు శరీరానికి ఎంత అవసరమే అంత కొవ్వు తీసుకుంటే బరువుతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చు.

These are the main causes of overweight! Experts say you can get rid of obesity with awareness
Overweight : అధిక బరువు అన్నది చాలా మందిలో పెద్ద సమస్యగా మారింది. ఊబకాయం సమస్యతో బాధపడుతూ బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలు, కదలిక లేని జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్ లు అధిక బరువుకు ప్రధాన కారణాలు. శారీరకంగా శ్రమ లేకుండా ఉంటే శరీరంలో శక్తి నిల్వలు పేరుకుపోతాయి. అవి కొవ్వులుగా మారుతాయి. అధిక బరువు పెరగటానికి అసలు కారణం తినేటప్పుడు చేసే తప్పులేనని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తినే విషయంలో ; ఉదయం వేళ మంచి ఆహారం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. పగటివేళ మితాహారం తీసుకోవాలి, రాత్రి వేళ చాలా తక్కువ మాత్రమే తినాలి. అల్పాహారం చేయకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువ మొత్తంలో తినాల్సి వస్తుంది. అలాగే రాత్రి కూడా ఎక్కువ తినాలనిపిస్తుంది. దీని వల్ల బరువు పెరుగుతారు.
ఒకసారివాడిన నూనెను మరోసారి ; స్వీట్లు, చిరుతిళ్లు చేసినప్పుడు ఎంతో కొంత నూనె మిగిలిపోతుంది. ఈ నూనెను మళ్లీ మరో వంటకానికి ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా శరీరంలో పెరుగుతుంది. దీనివల్ల బరువు పెరగటంతోపాటు ఆరోగ్య పరమైన సమస్యలు వస్తాయి.
శరీరానికి అవసరమైన మోతాదులో కొవ్వులు తీసుకోకపోవటం ; బరువు తగ్గాలంటే కొవ్వులకు దూరంగా ఉండాలని చాలా మంది బావిస్తుంటారు. అయితే శరీరానికి శక్తి వచ్చేది కొవ్వు పదార్థాలన్న విషయం చాలా మందికి తెలియదు. రోజు శరీరానికి ఎంత అవసరమే అంత కొవ్వు తీసుకుంటే బరువుతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చు. చెడు కొవ్వుకలిగిన ఆహారాలు కాకుండా మంచి కొవ్వులె ఎండు గింజలు, అవకాడోలు, ఆలివ్ నూనె మొదలైన కొవ్వు ఆమ్లాలను తీసుకోవడం మంచిది.
తినే ఆహారంలో అన్ని పోషకాలు సమతూకంగా ఉండేలా ; తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉందో లేదో అనేది చాలా చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం అంటే అందులో కొవ్వులు, ఫైబర్, పోషకాలు, విటమిన్లు అన్నీ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు, మాంసం, కోడి గుడ్లు, నూనెలు తీసుకోవడమే సమతుల్య ఆహారం. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల సగం రోగాలు దరిచేరకుండా చూసుకోవటంతోపాటు బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రేగుల్లో బ్యాక్టీరియా యొక్క మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి పెరుగు వంటి ప్రోబయోటిక్స్‌ను తగినంతగా తీసుకోవాలి. వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు. ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం లాంటి సమస్యలు దరిచేరవు.
క్యాలరీలు తక్కువగా ఉండేలా ; క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన సలహా ప్రకారం పండ్లు, కూరగాయలు ఒబెసిటి రిస్క్‌ను తగ్గిస్తాయి. పోషకాలు అధికంగా ఉండి, డయాబెటిస్‌ను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆహారం వల్ల క్యాలరీలు కొద్దిగా లభించినా కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. ఈ కారణంగా బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు.