Eucalyptus : శ్వాసకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించే యూకలిప్టస్ !
యూకలిప్టస్ ఆయిల్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది. దీని ఘాటైన నూనె, శరీరాన్ని చల్లబరచి బాక్టీరియా, ఇతర క్రిములను నశింపజేస్తుంది. యూకలిప్టస్ నూనెను చర్మం అధికంగాను వేగంగాను పీల్చుకుంటుంది. యూకలిప్టస్ నూనె శరీర మర్దనకు ఉపకరిస్తుంది.

Eucalyptus
Eucalyptus : శ్వాసకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో దీనికి సామర్ధ్యం ఉందని తెలుస్తోంది. వీటితో పాటుగా దీనిని యాంటీసెప్టిక్‌గా, నొప్పులకు, ముక్కులు బ్లాక్ అయినప్పుడు, మైగ్రైన్లు, జ్వరాలు, కండరాల నొప్పులు, ఇతర నొప్పులకు ఉపయోగించవచ్చు. అయితే పిల్లలకు పాలు ఇచ్చే స్ర్తీలు, మూర్ఛ రోగం ఉన్నవారు దీనిని ఉపయోగించరాదు.
యూకలిప్టస్ ఆయిల్ శరీరానికి ఎన్నో ప్రయోజనాలని అందిస్తుంది. దీని ఘాటైన నూనె, శరీరాన్ని చల్లబరచి బాక్టీరియా, ఇతర క్రిములను నశింపజేస్తుంది. యూకలిప్టస్ నూనెను చర్మం అధికంగాను వేగంగాను పీల్చుకోవటం వల్ల ఈ నూనెను శరీర మర్దనకు ఉపయోగిస్తారు. చర్మం మంటలు, పురుగులు కుట్టిన నొప్పులు, బొబ్బలు మొదలైనవి రెండు చుక్కలు వేస్తే సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
యూకలిప్టస్ వల్ల ఉపయోగాలు ;
1. యూకలిప్టస్ ఆయిల్ సహజ సువాసన కలిగి ఉంటుంది. చర్మంపై వచ్చే అనేక వ్యాధులను, మ్యూకస్ విడుదల, పుండ్లు, యోని సంబంధిత ఇతర వ్యాధులు నయం చేయటంలో ప్రభావవంతంగా ఉపకరిస్తుంది. చర్మం సెప్టిక్. చీము పట్టినా దీని వాడకం వల్ల ఉపయోగం ఉంటుంది.
2. ఈ నూనె రాస్తే చర్మం నునుపు రావటం, చర్మంపై మచ్చలు పోవడం జరుగుతుంది. భుజాలు, వీపు భాగాలకు విటమిన్ ఇ ఆయిల్ తో కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి. నొప్పుల నివారణకు సహజ ఔషధం. శారీరక, కీళ్ళ నొప్పులు తగ్గించి మెదడు కు రిలాక్సేషన్ కలిగిస్తుంది.
3. బకెట్ వేడి నీటిలో కొద్ది చుక్కలు వేసి స్నానం చేస్తే ఎంతో హాయిగా వుంటుంది. చర్మ సంబంధిత వ్యాధులకు ఉపయోగించవచ్చు. పురుషులు షేవింగ్ తర్వాత షేవ్ లోషన్ గా వాడుకోవచ్చు.
5. యూకలిప్టస్ ఆయిల్ ను శనగపిండి లేదా ముల్తాని మిట్టితో కలిపి రాస్తే చర్మం పొడిబారకుండా వుండి మెత్తగాను, ఎంతో అందంగా, ఆకర్షణీయంగా మారుతుంది. తలనొప్పిని వదిలించుకోవడానికి ఈ నూనె రెండు చుక్కలను నుదుటిపై అప్లై చేసి, తేలికపాటిగా చేతులతో మసాజ్ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
6. యూకలిప్టస్ ఆయిల్ దగ్గుకు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. సూక్ష్మజీవులు, టాక్సిన్‌లను తొలగించి సులభంగా శ్వాస తీసుకునేందుకు సహాయపడుతుంది.