Hair Extensions : హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారా? తరచూ వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

జట్టు పొడవు లేదనో, ఒత్తుగా లేదనో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతుంటారు. తరచుగా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయట.

Hair Extensions : ఇటీవల కాలంలో చాలామందిలో జుట్టు ఊడిపోవడం సమస్యగా మారింది. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డ తర్వాత కూడా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొన్నారు. జుట్టు తక్కువగా ఉన్న మహిళలు పార్టీల్లో, ఫంక్షన్లలో పొడవైన జుట్టు కోసం ఇటీవల ఎక్కువగా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారు. అసలు వీటిని వాడొచ్చా? ఎక్కువగా వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి?

Hair Regeneration : జుట్టు రీజనరేషన్ తో బట్టతలకు బైబై

కొంతమంది ఆడవారిలో పొడవైన జుట్టు ఉన్నా ఒత్తు లేకపోవడం.. పలచగా ఉండటం సమస్య కనిపిస్తుంది. అలాంటివారు దానిని దాచడానికి హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నారు. ఎక్కువగా వీటిని వాడటం వల్ల అనేక సమస్యలు వస్తాయట. వీటిని ఎక్కువగా మాడుకి అతికిస్తారు. అలా చేయడం వల్ల చర్మంపై ఎఫెక్ట్ పడి దురద, దద్దుర్లు వస్తాయి. ఒత్తైన హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడటం వల్ల బరువు ఎక్కువై నార్మల్‌గా ఉన్న హెయిర్ తెగిపడే అవకాశం ఉంటుంది.

హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడుతున్నప్పుడు వాటిని తీసే క్రమంలో బలవంతంగా లాగకూడదు ఎందుకంటే జుట్టు ఊడిపోతుంది. వాటిని రిమూవ్ చేసేటపుడు నెమ్మదిగా వేళ్లతోనే తీయాలి. రెగ్యులర్‌గా తలస్నానం చేస్తాం.. దానివల్ల జుట్టు శుభ్రపడుతుంది. కానీ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ విషయానికి వస్తే ఎక్కువగా వాష్ చేయం. తలలో చమట కారణంగా వాటిపై సూక్ష్మక్రిములు చేరతాయి. ఇవి తలమీద చేరి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. అందువల్ల హెయిర్ ఎక్స్‌టెన్షన్స్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.

Hair Health : జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే !

హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అన్నీ నేచురల్ హెయిర్‌తో తయారు చేసినవి కాకపోవచ్చు. కొన్నిట్లో సింథటిక్ వాడతారు. వాటిలో ఉండే కెమికల్స్ పడకపోతే ఉన్న జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని కొనేటపుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ వాడటం బెటర్.

ట్రెండింగ్ వార్తలు