Diet For Dengue : డెంగ్యూ సమయంలో తీసుకోవాల్సిన ఆహారాలు

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి, ప్లేట్‌లెట్లను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్లేట్‌లెట్స్ చాలా ముఖ్యమైనవి.

Diet For Dengue : డెంగ్యూ ఇటీవలి కాలంలో పెద్ద సవాలుగా మారింది. డెంగ్యూ వైరస్ (DENV) దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డెంగ్యూ అత్యంత ఎక్కువగా వ్యాప్తి చెందే వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించింది. ఇది ఆడ ఏడెస్ జాతి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ప్లేట్‌లెట్ స్థాయిలు పడిపోవడానికి మరియు రక్త నాళాలను దెబ్బతీయడానికి కారణమవుతుంది. డెంగ్యూ జ్వరంలో అనేక రకాలు ఉన్నాయి. వెంటనే చికిత్స చేయకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు.

READ ALSO : Indians Returned : ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి.. తొలి విమానంలో 212 భారతీయులు

ఈడెస్ దోమ కుట్టిన కొద్ది రోజులలో కీళ్లు, కండరాల నొప్పులు, అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు తక్కువ కాల వ్యవధిలో తీవ్రమవుతాయి. డెంగ్యూ వైరస్‌తో పోరాడడంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవటం చాలా అవసరం. ఈ వైరల్ ఫీవర్‌కి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ ఆరోగ్యకరమైన సమతుల్య, పోషక ఆహారం చాలా కీలకం. డెంగ్యూ జ్వరం సమయంలో తినాల్సిన మరియు నివారించాల్సిన ఆహారాల గురించి తెలుసుకోనే ప్రయత్నం చేద్దాం…ప్లేట్‌లెట్లను పెంచుకోవటానికి, బలహీనతను పోగొట్టుకోవటానికి ఆహార నియమావళిని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి.

హైడ్రేషన్ ; డీహైడ్రేషన్ నివారించడానికి ముఖ్యంగా వాంతులు లేదా విరేచనాలు కలిగి ఉంటే. ఈ లక్షణాలు శరీరంలోని ద్రవాలు కోల్పోయేలా చేస్తాయి. నీరు, సూప్, లేత కొబ్బరి నీరు , ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవటం ద్వారా ద్రవ అసమతుల్యతను సరిచేయడానికి సహాయపడతాయి. అయితే చక్కెర పానీయాలు , శీతల పానీయాలను నివారించటం మంచిది. ఇవి డీహైడ్రేషన్ కు దారితీస్తాయి.

READ ALSO : Anagani Satya Prasad : సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిగా మారింది : ఎమ్మెల్యే అనగాని

తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవటం ; పెద్ద మొత్తంలో భోజనం చేయడం కంటే తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు భోజనం చేయడం మంచిది. జీర్ణశయాంతర వ్యవస్థపై ఒత్తిడి లేకుండా శరీరం సరైన మొత్తంలో పోషకాలను పొందేందుకు ఇది సహాయపడుతుంది.

పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్నితీసుకోవటం ; ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలలో సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు , తృణధాన్యాలు వంటి ముఖ్యమైన పోషకాహారాలను తీసుకోవాలి.

అధిక కొవ్వు, అధిక ఫైబర్ ఉండే ఆహారాన్ని తగ్గించటం ; కొవ్వు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ ఆహారాలు జీర్ణం కావడం కష్టం, జీర్ణవ్యవస్థపై చాలా ఒత్తిడి పడేలా చేస్తాయి.

READ ALSO : Gold Price Today : మరింత పెరిగిన బంగారం ధర .. తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాములు ధర ఎంతంటే..?

డెంగ్యూ సమయంలో తినవలసిన , త్రాగవలసిన ఆహారాలు ;

విటమిన్ సి ఫుడ్స్‌ ; డెంగ్యూ సమయంలో ఆహారంలో భాగంగా ఉండవలసిన ముఖ్యమైన పోషకాలలో విటమిన్ సి ఒకటి. శక్తివంతమైన యాంటీ-వైరల్ , యాంటీఆక్సిడేటివ్ లక్షణాలతో విటమిన్ సి బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది. నారింజ, నిమ్మ, బొప్పాయి, జామ మొదలైనవి వాటితోపాటుగా ఆకుకూరలు, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలను తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బొప్పాయి రసం జీర్ణక్రియను పెంపొందించటంతోపాటుగా, ఉబ్బరం ఇతర జీర్ణ సమస్యలకు చికిత్స చేస్తాయి. అలాగే, తాజా బొప్పాయి ఆకు రసం ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపరచడం ద్వారా డెంగ్యూ చికిత్సలో సహాయపడుతుంది.

ఐరన్ రిచ్ ఫుడ్స్ ; డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచటానికి, ప్లేట్‌లెట్లను ఉత్పత్తి చేయడానికి ఐరన్ అవసరం. రక్తం గడ్డకట్టే ప్రక్రియలో ప్లేట్‌లెట్స్ చాలా ముఖ్యమైనవి. అందువల్ల రక్తానికి జరిగే నష్టాన్ని నివారించడం చాలా ముఖ్యం. బీన్స్ మరియు చిక్కుళ్ళు, ఆకుపచ్చ ఆకు కూరలు , ఖర్జూరం వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ ఐరన్ ను పెంచటంలో తోడ్పడతాయి. ఇవి ప్లేట్‌లెట్ ను పెంచడంలో , త్వరగా రికవరీ కావటానికి సహాయపడతాయి.

READ ALSO : Kishan Reddy : కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ, బీఆర్ఎస్ కొనుగోలు పార్టీ- కిషన్ రెడ్డి

విటమిన్ K ఆహారాలను తీసుకోవటం ; విటమిన్ K అనేది ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపరచడంలో సహాయపడే మరొక ముఖ్యమైన పోషకం. రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించటంలో ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా కోలుకోవాలంటే మొలకలు, బ్రోకలీ, క్యాబేజీ, బచ్చలికూర, కాలే, కివీ, అవోకాడో మరియు వంటి విటమిన్ K అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది.

క్యాలరీ కలిగిన ఆహారాలు ; డెంగ్యూ వైరస్ వచ్చినప్పుడు శరీరం బలహీనంగా మారి అలసటకు లోనవుతుంది. అన్నం, పాలు, బంగాళాదుంప వంటి శక్తి వంతమైన ఆహారాలను పుష్కలంగా తీసుకోవాలి. ఇవి కోల్పోయిన బలాన్ని తిరిగి పొందడంలో సహాయపడతాయి.

READ ALSO : Vijayasai Reddy : మీ భర్త మీద కూడా అమిత్‌ షాకి ఫిర్యాదు చేశారా? లేదా? పురంధేశ్వరిని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి

తగినంత ద్రవాలు ; డెంగ్యూ జ్వరం నుండి కోలుకుంటున్న సమయంలో నీరు తాగటం అత్యంత ముఖ్యమైనది. నీరు, లేత కొబ్బరి నీరు, సూప్ , బియ్యం గంజి వంటి ద్రవాలు పుష్కలంగా త్రాగాలి. ఎందుకంటే అవి ఎలక్ట్రోలైట్‌లతో అనగా పొటాషియం, కాల్షియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి వాటితో నిండి ఉంటాయి. ద్రవాలు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి. హైడ్రేట్‌గా ఉంచుతాయి.

 

ట్రెండింగ్ వార్తలు