Kishan Reddy : కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ, బీఆర్ఎస్ కొనుగోలు పార్టీ- కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వం పోవాలని.. బీజేపీ ప్రభుత్వం రావాలని.. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. Kishan Reddy

Kishan Reddy : కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ, బీఆర్ఎస్ కొనుగోలు పార్టీ- కిషన్ రెడ్డి

Kishan Reddy Fires On KCR (Photo : Facebook)

Kishan Reddy Fires On KCR : తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేసీఆర్ సర్కార్ పోవాలని, బీజేపీ రావాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం దివాళా తీసిందన్నారు కిషన్ రెడ్డి. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే అరెపల్లి మోహన్ బీజేపీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

”ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. చాలా వేగంగా రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ మీద మేమే పెత్తనం చేస్తామని దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్. కేసీఆర్ ప్రభుత్వం పోవాలని రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కోరుకుంటున్నారు. కర్ణాటకలో గెలిచాము. తెలంగాణలో కూడా గెలుస్తాం అని కాంగ్రెస్ కబుర్లు చెబుతోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ రావాలని అంటున్నారు. అనేక రకాల సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి.

Also Read : షర్మిల ఔట్‌.. కోదండరామ్‌ ఇన్‌.. గెలుపే టార్గెట్‌గా కాంగ్రెస్‌ ఎత్తుగడలు!

ఎమ్మెల్యేలను అమ్ముకునే పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీకి ఓటేస్తే వారు గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ లోకీ వెళ్తారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ వారే చెప్పారు. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీ. బీఆర్ఎస్ కొనుగోలు పార్టీ. మజ్లిస్ పార్టీ డ్రామాలు చేస్తుంది. ఓట్లు చీల్చే పని మజ్లిస్ పార్టీ చేస్తుంది. చాలా చైతన్యం చేసే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి.

తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వము నడుస్తుంది. 40వేల కోట్ల రూపాయల ఆదాయం రాబట్టుకుంటుంది. బెల్టు షాపులు పెట్టి ప్రజల రక్తం తాగుతోంది కేసీఆర్ ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు రద్దు చేస్తాం. మహిళలకు అండగా బీజేపీ ఉంటుంది. బీఆర్ఎస్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు నిలబడి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో గెలిపించండి. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సి ఉంది.

Also Read : మళ్లీ రేసులోకి జానారెడ్డి.. సీఎం పీఠంపైనే పెద్దాయన గురి!

ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యే..
కేసీఆర్ ప్రజల విశ్వాసం కోల్పోయారు. పోలీస్ వెహికల్స్ లో డబ్బులు పంచేందుకు కేసీఆర్ సిద్దం అయ్యారు. అందుకే ఎన్నికల కమిషన్ గుర్తించి పోలీస్ కమిషనర్లను, జిల్లా ఎస్పీలను మార్చింది. చాలామంది అధికారులను ఎన్నికల సంఘం మార్చాల్సి ఉంది. పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరు. ఈసారీ ప్రతి నియోజకవర్గానికి రూ.50 కోట్ల నుండి 100 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. ఆ సొమ్మంతా అక్రమంగా దోచుకున్నదే.