Bone Soup : కీళ్ళ సంబంధిత సమస్యలకు… బోన్ సూప్

ఆర్థ్రయిటిస్‌, డిజనరేటివ్‌ జాయింట్‌ డిసీజ్‌, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌లకూ, తగ్గిన వ్యాధినిరోధకశక్తి పెరుగుదలకూ తోడ్పడుతుంది. ఎముక మజ్జతో పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.

Bone Soup : కీళ్ళ సంబంధిత సమస్యలకు… బోన్ సూప్

Bone Soup

Updated On : December 13, 2021 / 11:29 AM IST

Bone Soup :బోన్ సూప్ లో ఎన్నో రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. బోన్ సూప్ ను చికెట్, మటన్, బీఫ్ ఎముకలతో తయారు చేస్తారు. గాయాలు త్వరగా మానడానికి, అనారోగ్యానికి గురైన వారు వేగంగా కోలుకోవడానికి బోన్ సూప్ తాగిస్తారు. ఇందులో ఉండే పోషకాలే అందుకు కారణం. బోన్ బ్రోత్‌గా పిలిచే ఎముకల రసం తాగడం వల్ల ఒంట్లోని విషతుల్యాలు బయటకు వెళ్తాయి. అనేక అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కీళ్ల సంబంధ సమస్యలు దూరం అవుతాయి.

జంతువుల శరీరంలో ఈ జెలటిన్ ను ఉప్పత్తి చేసే ప్రోటీన్లు అధికంగాఉంటాయి. వాటిని సూప్ రూపంలో తీసుకోవడం వలన జాయింట్స్ ను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా నొప్పులు తొలగిపోతాయి. తీవ్రమైన వ్యాధులు, సర్జరీల నుంచి కోలుకునే సమయంలో బోన్‌ సూప్‌ తాగాలని అంటూ ఉంటారు. ఈ సూప్‌లో వెలకట్టలేని పోషకాలు ఉండడమే అందుకు కారణం. ఇవి మన వ్యాధినిరోధకశక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎముకలు బలపడటానికి బోన్ సూప్ ఎంతో సహకరిస్తుంది. ఎముకల నుంచి కాల్షియం తగ్గిపోకుండా కాపాడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్ల మధ్యన ఉండే జెలాటిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి రాపిడికి గురవుతాయి. ఎముకల సూప్‌తో మృదు కణజాలం తయారై గాయాలు తేలికగా మానతాయి. మృదులాస్థి, ఎముకల మరమ్మతుకు తోడ్పడుతుంది. మ్యూకస్‌ మెంబ్రేన్‌, పేగుల్లోని లోపలి పొర తయారీకి సహాయపడుతుంది.

ఆర్థ్రయిటిస్‌, డిజనరేటివ్‌ జాయింట్‌ డిసీజ్‌, ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌లకూ, తగ్గిన వ్యాధినిరోధకశక్తి పెరుగుదలకూ తోడ్పడుతుంది. ఎముక మజ్జతో పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, ,వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక కప్పు బోన్ సూప్ లో డయేరియా, మలబద్ధకం సమస్యలను నివారించే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మనశరీరంలో అతి ముఖ్యమైన అవయవాలలో లివర్ కూడా ఆ ఒకటి. మద్యం తాగడం, ఇతర కారణాల వల్ల డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ ను తిరిగి ఉత్పత్తి చేస్తుంది.

అల్సర్, ఫుడ్ అలర్జీలతో బాధపడేవారికి బోన్ సూప్ దివ్యౌషధం. ఒంట్లో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగిస్తుంది. బోన్ సూప్ తాగడం వల్ల మంచి బ్యాక్టీరియాను పెంచి పొట్టలోని క్రీములను తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుగుస్తుంది. సాధారణంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు మన శరీరం ఈ అమైనో యాసిడ్ ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. బోన్ సూప్ ను తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన శక్తి సమకూరుతుంది. వారం రోజుల పాటు బోన్ సూప్ ను తీసుకుంటే అది ఎన్నో రకాల సప్లిమెంట్లను సహజంగానే శరీరానికి అందుతాయి. మానసికంగా, శారీరకంగా వీక్ గా ఉన్నవారికి బోన్ సూప్ తాగిస్తే చాలా త్వరగా కోలుకుంటారు.