Heart Health : గుండె ఆరోగ్యానికి గ్రీన్ బఠానీ!

పచ్చిబఠానీలు చర్మానికి మేలు చేస్తుంది. పచ్చిబఠానీల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి వృద్దాప్యాన్ని నివారించటంలో సహాయపడతాయి.

Heart Health : గుండె ఆరోగ్యానికి గ్రీన్ బఠానీ!

Green Peas

Updated On : April 27, 2022 / 2:47 PM IST

Heart Health : పచ్చి బఠాణీలు వీటినే గ్రీన్ బఠానీలు అని కూడా అంటారు. గ్రీన్ బఠానీలు అనేక పోషకాలను కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చిబఠాణీల్లో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్- A,C,K లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచుగా తినడం వల్ల గుండెకు మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. గ్రీన్ బఠానీలలో పొటాషియం,మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి, ఇవి అధిక రక్తపోటును నివారిస్తాయి. బఠానీలలో అధిక ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బఠానీలు ఫైబర్, ప్రోటీన్ యొక్క మంచి మూలం, ఇవి రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను నిరోధిస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి.

పచ్చిబఠానీల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటంతో మలబద్దకాన్ని అరికడుతుంది. పచ్చిబఠానీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. పచ్చిబఠానీల్లో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువ కాబట్టి బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను క్రమబద్దం చేసే వరకూ సహాయపడే గుణగణాలు పచ్చిబఠానీల్లో ఉన్నాయి. పచ్చి బఠాణిలో ఉండే విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్స్ వాపులు, నొప్పులను తగ్గించటంలో బాగా సహాయపడతాయి. గాయాలను కూడా త్వరగా నయం చేస్తాయి. పచ్చిబఠానీల్లో ఉండే విటమిన్ కె, బి పుష్కలంగా ఉండి బోన్స్‌ను ధృడంగా ఉంచుతుంది.

పచ్చిబఠానీలు చర్మానికి మేలు చేస్తుంది. పచ్చిబఠానీల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి వృద్దాప్యాన్ని నివారించటంలో సహాయపడతాయి. చర్మం ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉండేలా చర్మ కణాలను ప్రోత్సహిస్తాయి. వీటిల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి జీర్ణ క్రియ బాగా జరిగేలా ప్రోత్సాహం ఇస్తుంది. పచ్చి బఠాణిలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండుట వలన గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. పిండం ఎదుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని అందించటం జరిగింది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలన్నా వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.