Work From Home : మంచంపై నుండే ఆఫీసు కార్యకలాపాలతో ఆరోగ్య సమస్యలు

పని చేస్తున్నప్పుడు నిరంతరాయంగా వంగడం , మంచం మీద వంకరగా ఉండడం వల్ల వెన్నునొప్పి, మెడ స్ట్రెయిన్ , కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌తో సహా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Work From Home : కోవిడ్ తరువాత ఆపీసులో చేయాల్సిన పని కార్యకలాపాలు అన్ని ఇంటి నుండే చేయాల్సి వస్తుంది. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంట్లోని పడక గదుల నుండి తమ ఆఫీసు వ్యవహారాలు చక్కదిద్దుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ తో మంచం పై నుండి వర్క చేయటానికి ఇష్టపడుతున్నారు. చాలా మందికి ఇంటి నుండి వర్క్ చేయటం సరైనదే అనిపించినప్పటికీ మంచంపై నుండి డిజిటల్ పరికరాలను వినియోగించటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

READ ALSO : Lack Of Sleep : నిద్రలేమి బరువు పెంచేలా చేస్తుందా?

మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం :

మంచం మీద నుండి పని చేస్తున్నప్పుడు వ్యక్తిగత జీవితం , వృత్తిపరమైన జీవితాల మధ్య అస్పష్టత ఏర్పడుతుంది. మీరు ఎక్కువ గంటలు పనికి సంబంధించిన కార్యకలాపాలలో నిమగ్నమయ్యే అవకాశం ఉన్నందున దీని వల్ల ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి. అంతేకాకుండా, ఇది విశ్రాంతి స్థలంగా మంచంతో ఉన్న మానసిక అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా నిద్రపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

సౌకర్యవంతంగా లేకపోవడం ;

ఎక్కువ గంటలు పని చేయడానికి వీలుగా సరైన భంగిమలో కూర్చోవటానికి వీలుగా బెడ్ రూమ్ లో మంచాలు రూపొందించబడలేదు. పని చేస్తున్నప్పుడు నిరంతరాయంగా వంగడం , మంచం మీద వంకరగా ఉండడం వల్ల వెన్నునొప్పి, మెడ స్ట్రెయిన్ , కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌తో సహా శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

READ ALSO :  Skin Diseases In Diabetics : మధుమేహ బాధితుల్లో చర్మ వ్యాధులను ప్రేరేపించే వర్షాకాలం.. చర్మ ఆరోగ్యం కోసం అనుసరించాల్సిన విధానాలు !

కంటి ఆరోగ్యంపై ప్రభావాలు ;

కంటి ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య వచ్చే అవకాశం ఉంది. కళ్ళపై అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి కంప్యూటర్ స్క్రీన్‌లను కంటికి అనువైన స్థాయిలో ఉంచాలి. అయితే మంచం మీద నుండి పని చేస్తున్నప్పుడు ఇది సాధ్యం కాదు. ఈ పద్ధతివల్ల కంటి పైఒత్తిడి పెరిగి ఇతర దృశ్య ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

పనిపై ఏకాగ్రత కోల్పోవటం ;

మంచం నుండి పని చేయడం వలన పనిపై ఏకాగ్రత తగ్గుతుంది. దీనివల్ల మొత్తం పని అవుట్‌పుట్‌పై ప్రభావం చూపే ప్రభావం ఉటుంది. అదే క్రమంలో మిమ్మల్ని బద్ధకంగా మార్చేందుకు కారణమవుతుంది. అంతేకాకుండా పని మధ్యలో కూడా నిద్రపోయే అవకాశం ఉంటుంది.

READ ALSO : Boost Immunity During Monsoon : వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం మీ ఆహారంలో చేర్చుకోవలసిన 4 అద్భుతమైన సూపర్‌ఫుడ్‌లు !

చివరగా మంచాన్ని మీ వర్క్‌స్పేస్‌గా మార్చుకోవటం అన్నది సౌకర్యవంతంగా అనిపించవచ్చు కానీ, మానసిక , శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు కోసం పని, విశ్రాంతి కోసం తగిన ఏర్పట్లు చేసుకోవటం ఉత్తమం.

ట్రెండింగ్ వార్తలు