Urinary Problems : డీహైడ్రేట్ సమస్య కారణంగా ఎదురయ్యే మూత్ర సంబంధిత సమస్యలను తొలగించుకోవాలంటే?

ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి బ్యాక్టీరియా దరిచేరకుండా చేయవచ్చు. అలాగే ట్రాక్ట్‌లో బ్యాక్టీరియా ఉండకుండా ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.

Urinary Problems : డీహైడ్రేట్ సమస్య కారణంగా ఎదురయ్యే మూత్ర సంబంధిత సమస్యలను  తొలగించుకోవాలంటే?

How to get rid of urinary problems due to dehydration problem?

Updated On : November 2, 2022 / 6:49 PM IST

Urinary Problems : మూత్రనాళంలోని ఏదైనా ప్రాంతంలోకి హానికరమైన బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, వెంటవెంటనే మూత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. వెన్నెముక, పొత్తికడుపు కింది భాగంలో నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. యూటీఐ సమస్యతో బాధపడుతున్న వారు హై ఫైబర్‌ ఉన్న ఆహారాలను తీసుకోవడంపై దృష్టిసారించాలి. అధిక ఫైబర్‌ ఫుడ్స్ సహజంగా మూత్రాశయం, మూత్రనాళాలను శుభ్రపడతాయి. దీంతో యూటీఐ సమస్యను తొలగించుకోవచ్చు.

మూత్రాశయ సమస్యను ఎదుర్కొంటున్నవారి శరీరం డీహైడ్రేట్‌ అవుతుంది. ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి బ్యాక్టీరియా దరిచేరకుండా చేయవచ్చు. అలాగే ట్రాక్ట్‌లో బ్యాక్టీరియా ఉండకుండా ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. అందుకని రోజులో కనీసం మూడు లీటర్లకు తక్కువ కాకుండా ద్రవాలు తీసుకోవాలి. కొబ్బరి నీరు మరీ మంచిది. బియ్యం నీరు ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించేందుకు సాయపడుతుంది. రోజువారిగా ఫైబర్‌ కలిగిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు తినడం వల్ల సమస్యలు రాకుండా నియంత్రించవచ్చు.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా యూటీఐ ప్రమాదాన్ని తగ్గించేందుకు తేలికపాటి వ్యాయామాల్ని ఎంచుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన సందర్భాల్లో ఈ సమస్య పెరుగుతుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలతో మూత్రాశయం బలపడి మూత్ర విసర్జన చేసే సమయం తగ్గుతుంది. యూటీఐని ప్రేరేపించే ఆహారాలు, పానీయాలను దూరం పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా మసాలా ఆహారాలు, సిట్రస్‌ పండ్లు, కెఫిన్‌, బీర్‌, రెడ్ వైన్‌, ఇతర ఆల్కహాల్‌ పానీయాలను దూరం పెట్టాలి.